
ఆకాశ్ పడియామీకి ఘన స్వాగతం
మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లా కొయా తెగకు చెందిన ఆదివాసి యువకుడు ఆకాశ్ పడియామీ అంధుల ఫుట్‌బాల్‌లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాడు. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 4 వరకు కేరళలో జరిగింది. అంతర్జాతీయ బ్‌లైండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలో భారత్ తరఫున ఈ గిరిజన యువకుడు ఆడాడు. మొత్తం ఆరు దేశాలు పాల్గొన్న పోటీల్లో పాల్గొన్నాడు. మంగళవారం స్వస్థలం అయిన మల్కన్‌గిరి చేరుకున్న ఆయనకు స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. ఆకాశ్ తన సొంత ఊరు అయిన గోరఖుంటా పంచాయతీ కృష్ణవార్డ్‌కు వెళ్లారు. అక్కడ ఆదివాసీలు నృత్యాలతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో సర్పంచ్ పదియే కబాసీ, మాజీ సర్పంచ్ ఎరా పడియామీ, సమితి సభ్యులు దేవే మాడీ, అడమా మాడీ, సోమా మడ్కమి, సామాజిక కార్యకర్త దుర్గా త్రిపాఠీ తదితరులు పాల్గొన్నారు.

ఆకాశ్ పడియామీకి ఘన స్వాగతం