
యువకుడి ఔదార్యం
రాయగడ: రోడ్డుపై తనకు దొరికిన 11 గ్రాముల బంగారాన్ని పోలీసు అధికారి సమక్షంలో బంగారం పోగొట్టుకున్న వ్యక్తికి ఇచ్చి తన ఔదార్యాన్ని చాటుకున్నాడు ఒక యువకుడు. స్థానిక రింగ్ రోడ్డు సమీపంలో గల మంగళామందిరం వద్ద నివసిస్తున్న ఎం.రమేష్ అనే యువకుడు రహదారిలో నడుస్తున్న సమయంలో బంగారం దొరికింది. దీంతో అతడు సరాసరి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తనకు దొరికిన బంగారం గురించి చెప్పాడు. ఇదిలాఉండగా గత ఆదివారం నాడు సుమంత్ మహారాణ అనే పాత్రికేయుడు తాను ఖరీదు చేసిన 11 గ్రాముల బంగారం ఇంటికి తీసుకువస్తుండగా ఎక్కడో పడిపోయిందని ఫిర్యాదు చేశారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ఐఐసీ ప్రసన్న కుమార్ బెహరా అన్ని ఆధారాలు పరిశీలించిన మీదట బంగారం పోగొట్టుకున్న సుమంత్‌ని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి మంగళవారం రమేష్ సమక్షంలో బంగారాన్ని తిరిగి ఇచ్చారు. ఈ సందర్భంగా రమేష్‌ను పోలీసులు అభినందించారు.
చిత్రకూట్ జలపాతం సందర్శన
కొరాపుట్: ఇండియా నయాగార జలపాతంగా పేరుపొందిన చిత్ర కూట్ జలపాతాన్ని కాంగ్రెస్ పార్టీకి చెందిన కొరాపుట్ ఎంపీ సప్తగిరి ఉల్క సందర్శించారు. మంగళ వారం సమీప ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో బస్తర్ ప్రాంతంలో ఉన్న చిత్రకూట్ జలపాతాల అందాలను తిలకించారు. తాను గతంలో విన్నట్లు ఇది ఇండియా నయాగరా జలపాతమఅని అభివర్ణించారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిశీలన కోసం ఏఐసీసీ ఆదేశంతో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో బస్తర్ జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
కుంకుమ పూజలు
జయపురం: స్థానిక రాజనర్ కూడలి వద్ద గజలక్ష్మీ పూజలు ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం గజలక్ష్మీ దేవికి కుంకుమార్చనలు నిర్వహించారు. వేద పండితులు కృష్ణచంద్ర దాస్ మహిళలతో పూజలు జరిపించారు. పూజా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
కొట్లాట ఘటనలో జరిమానా
వజ్రపుకొత్తూరు రూరల్: ఒంకులూరు గ్రామంలో 2016లో ఇరు వర్గాల మధ్య జరిగిన కొట్లాట ఘటనపై అదే గ్రామానికి చెందిన బడే సరస్వతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పట్లో అదే గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుపై పలాస సివిల్ జ్యుడీషియల్ కోర్టులో వాదప్రతివాదనలు జరిగాయి. ఈ మేరకు ముద్దాయిలైన దాసరి ధనలక్ష్మీ, సండుపల్లి సావిత్రిలకు రూ.1000 జరిమానా విధించింది. జరిమాన కట్టకపోతే 3 నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు కోర్టు తీర్పు విధించింది. ప్రధాన నిందుతుడు దాసరి ప్రదీప్‌పై తీర్పు పెండింగ్‌లో ఉన్నట్లు ఎస్సై బి.నీహర్ తెలిపారు.

యువకుడి ఔదార్యం

యువకుడి ఔదార్యం