● నేషనల్‌ యూత్‌ వలంటీర్లగా పనిచేసేందుకు ఆహ్వానం ● ఎంపికై తే పారితోషికం ● దరఖాస్తులకు నేడే ఆఖరు తేది | - | Sakshi
Sakshi News home page

● నేషనల్‌ యూత్‌ వలంటీర్లగా పనిచేసేందుకు ఆహ్వానం ● ఎంపికై తే పారితోషికం ● దరఖాస్తులకు నేడే ఆఖరు తేది

Oct 15 2025 5:32 AM | Updated on Oct 15 2025 5:32 AM

● నేష

● నేషనల్‌ యూత్‌ వలంటీర్లగా పనిచేసేందుకు ఆహ్వానం ● ఎంపి

● నేషనల్‌ యూత్‌ వలంటీర్లగా పనిచేసేందుకు ఆహ్వానం ● ఎంపికై తే పారితోషికం ● దరఖాస్తులకు నేడే ఆఖరు తేది

సువర్ణావకాశం

శ్రీకాకుళం న్యూకాలనీ: సమాజంలో కోసం ఏదైనా మంచి పని చేయాలని ఉందా ? సేవా కార్యక్రమాలను నిర్వహించాలనే ఆసక్తి ఉందా ? అయితే కేంద్ర ప్రభుత్వం మీకు చక్కటి అవకాశాన్ని కల్పిస్తోంది. నేషనల్‌ యూత్‌ వలంటీర్‌గా సమాజ సేవ చేసేందుకు ఆసక్తి గల యువత నుంచి దరఖాస్తులను ఆహానిస్తోంది. ఒకవైపు సేవ చేస్తూనే మరోవైపు ప్రతినెలా పారితోషికాన్ని పొందవచ్చు.అక్టోబర్‌ 15లోగా ‘ఎన్‌వైకెఎస్‌.ఎన్‌ఐసీ.ఇన్‌’ వెబ్‌పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం ఇలా..

దరఖాస్తుదారులకు శ్రీకాకుళం జిల్లాలోని మేరా యువభారత్‌ (నెహ్రూ యువకేంద్రం) కార్యాలయంలో ఇంటర్వ్యూ ఉంటుంది. అభ్యర్థుల వయస్సు అక్టోబర్‌ ఒకటి నాటికి 18 నుంచి 29 ఏళ్ల మధ్య ఉండాలి. కనీసం పదో తరగతి ఉత్తీర్ణత కలిగినవారు అర్హులు. డిగ్రీ అర్హతను కలిగి కంప్యూటర్‌ అప్లికేషన్స్‌, ఆండ్రాయిడ్‌ మొబైల్‌ ఫోన్లు, ఈ–బ్యాంకింగ్‌, డిజిటల్‌ వంటి వివిధ యాప్‌లలో సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు. మై భారత్‌ అనుబంధ యువజన సంఘాల సభ్యులు, మహిళా అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుందని అధికారులు చెబుతున్నారు. వివరాలకు 08942–222028, 9133095646 నంబర్లను

సంప్రదించవచ్చు.

ఎంపికై తే స్టైఫండ్‌ ఇలా..

వలంటీరుగా ఎంపికై నవారు ఏడాది కాలం పనిచేయాల్సి ఉంటుంది. ఎంపికై నవారికి నెలకు రూ.5వేల స్టైఫండ్‌ చెల్లిస్తారు.

విధులు ఇలా..

వలంటీర్లకు ప్రత్యేకంగా బ్లాకులను కేటాయిస్తారు. రెండు మండలాలను కలిపి ఒక బ్లాక్‌గా గుర్తిస్తారు. వలంటీర్లు యువజన, మహిళా సంఘాలను స్థాపించడం, సంఘాలను సమన్వయం చేసుకుని క్రీడలు, ఆరోగ్యం, అక్షరాస్యత, పారిశుద్ధ్యం, పచ్చదనం–పరిశుభ్రత, మహిళా సాధికారిత, లింగవివక్ష, ఇతర సామాజిక అంశాలపై ప్రజలను చైతన్యపరచడం, తదితర అంశాలో ప్రగతి సాధన కోసం పనిచేయాల్సి ఉంటుంది.

సమాజ సేవ చేయాలన్న ఆసక్తి కలిగినవారు మాత్రమే దరఖాస్తులు చేయండి. ఎంపికై నవారు తమకు అప్పగించిన బ్లాకుల్లో సామాజిక, చైతన్య కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంటుంది. బుధవారం సాయంత్రంలోగా దరఖాస్తు చేసుకోవాలి.

– కె.వెంకట్‌ ఉజ్వల్‌, మేరా యువ భారత్‌ డిప్యూటీ డైరెక్టర్‌ శ్రీకాకుళం

● నేషనల్‌ యూత్‌ వలంటీర్లగా  పనిచేసేందుకు ఆహ్వానం ● ఎంపి1
1/1

● నేషనల్‌ యూత్‌ వలంటీర్లగా పనిచేసేందుకు ఆహ్వానం ● ఎంపి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement