
నష్టపరిహారం చెల్లించాలని రాస్తారోకో
రాయగడ: జిల్లాలోని రామనగుడ సమితి పాలుపాయి వద్ద సోమవారం నాడు ట్యాంకర్, బైకు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో మృతి చెందిన ఇద్దరు యువకుల కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు రామనగుడ ప్రధాన రహదారి వద్ద మంగళవారం రాస్తారోకో నిర్వహించారు. దీంతో రాయగడ, గుణుపూర్, బరంపురం ప్రాంతాలకు వెళ్లేందుకు రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం తెలుసుకున్న రామనగుడ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళన కారులతో చర్చించారు. వారు అంగీకరించకపోవడంతో గుణుపూర్ ఎస్‌డీపీఓ బబులా నాయక్, బీడీఓ ప్రద్యుమ్న మండల్, తహసీల్దార్ ప్రాణకృష్ణ పాణిగ్రహి, ఐఐసీ సునీత బెహర తదితరులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సద్దుమణిగించేందుకు ప్రయత్నించారు. కానీ సుమారు నాలుగు గంటల సమయం వరకు పరిస్థితి అదుపులోకి రాలేదు. అనంతరం బాధిత కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడంతో పరిస్థితి కుదుటపడింది.

నష్టపరిహారం చెల్లించాలని రాస్తారోకో