
క్యాపిటల్ ఠాణా ముట్టడి
దారి పొడవునా స్తంభించిన వాహనాలు
భువనేశ్వర్: స్మార్ట్ సిటీ ఆన్‌లైన్ ఆటో డ్రైవర్ల సంఘం మంగళ వారం క్యాపిటల్ ఠాణాను చుట్టుముట్టింది. ఠాణా ముందు ఆటోలు దారి పొడవునా బారులు తీరాయి. రాజ్‌మహల్ కూడలి నుంచి ఏజీ చౌక్ వరకు రవాణా స్తంభించిపోయింది. వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. కొన్ని రోజుల కిందట ఆన్‌లైన్ స్మార్ట్ సిటీ ఆటో డ్రైవర్ల సంఘం సభ్యుడిని స్టేషన్ ఆటో డ్రైవర్ల సంఘం నుంచి కొంత మంది సభ్యులు కొట్టినట్లు ఆరోపణ. ఈ ఆరోపణ కింద సోమవారం క్యాపిటల్ ఠాణా పోలీసులు ఇరు వర్గాల సభ్యులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. పోలీసులు దోషులను అరెస్టు చేయకుండా అమాయకులను అరెస్టు చేశారని ఆన్‌లైన్ స్మార్ట్ సిటీ ఆటో డ్రైవర్ల సంఘం మంగళవారం విజృంభించి ఠాణా ముట్టడికి పాల్పడ్డారు.

క్యాపిటల్ ఠాణా ముట్టడి