
ఉల్లాసంగా.. ఉత్సాహంగా
జయపురం: జయపురం సమితి స్థాయి శిశు మహోత్సవం సురభి–2025 కార్యక్రమం స్థానిక జయనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమాన్ని హెచ్‌ఎం మీనతి పట్నాయక్, ప్రారంభించారు. జయనగర్ ఎస్.ఎస్ ప్రభుత్వ పాఠశాల, సునారి సాహి ఉన్నత పాఠశాల విద్యార్థులు సంగీతం, నృత్యంతో అలరించారు. సీఆర్‌సీసీ విజయలక్ష్మీ స్వై పర్యవేక్షణలో ప్రథమ శ్రేణి నుంచి పదో శ్రేణి విద్యార్థులకు వక్తృత్వ, వ్యాసరచన, చిత్ర లేఖన, నృత్య, సంగీత, హస్తాక్షర, క్విజ్, తదితర పోటీలను సీనియర్, జూనియర్ విభాగల్లో నిర్వహించారు. సీనియర్లు, జూనియర్లకు 26 పోటీలు నిర్వహించగా 180 మంది పాల్గొన్నారు. ఉత్తమ విజేతలుగా 25 మంది ఎంపికయ్యారు. విజేతలకు అతిథులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జయపురం బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారి చందన కుమార్ నాయక్, అదనపు విద్యాధికారి కె.గోపాల్, బీఈఓ కార్యాలయ సెక్షన్ అధికారి శశిభూషణ దాస్, జయపురం ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు దేవీ ప్రసాద్ దాస్, సీఆర్‌సీసీ రుద్ర ప్రసాద్ పాణిగ్రహి, రామేశ్వర పండా పాల్గొన్నారు.