
కళ్యాణసింగుపూర్‌లో వినతుల స్వీకరణ
రాయగడ: జిల్లాలోని కళ్యాణసింగుపూర్ సమితి సమావేశం హాల్‌లో సోమవారం జిల్లా కలెక్టర్ అశుతోస్ కులకర్ణి ఆధ్వర్యంలో వినతుల స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఎస్‌పీ స్వాతి ఎస్ కుమార్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి లక్షయ కుమార్ కెముండో, సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జెన్న, ఐటీడీఏ ప్రాజెక్టు అడ్మినిష్ట్రేటర్ చంద్రకాంత్ మాఝి, జిల్లా ముఖ్యవైద్యాధికారి డాక్టర్ సరోజిని దేవి తదితరులు హాజరయ్యారు. సమితి పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన 75 వినతులు కలెక్టర్ దృష్టికి వచ్చాయి. ఇందులో 63 వ్యక్తిగత సమస్యలు కాగా ఎనిమిది గ్రామ సమస్యలుగా గుర్తించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కులకర్ణి నలుగురికి వైద్య ఖర్చుల నిమిత్త ం రెడ్ క్రాస్ నిధుల నుంచి 60 వేల రుపాయలను మంజూరు చేశారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.