
అంబులెన్స్‌కు అనారోగ్యం!
● ఘాట్ రోడ్డులో రోగితో నిలిచిపోయిన అంబులెన్స్
కొరాపుట్: అత్యవసరంగా వెళ్లాల్సిన అంబులైన్స్‌కి అనారోగ్యం చేసింది. కొరాపుట్ జిల్లా బొయిపరిగుడ నుంచి రోగితో అత్యవసరంగా ప్రభుత్వ 108 అంబులైన్స్ సోమవారం బయలు దేరింది. జాతీయ రహదారి–26పై కొరాపుట్ ఘాట్‌పైకి వెళ్తుండగా అకస్మాత్తుగా నిలిచి పోయింది. దీంతో రోగి బంధువులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే అంబులైన్స్ డ్రైవర్ సహచర సిబ్బందిని సంప్రదించి మరో అంబులైన్స్‌ని రప్పించి అందులో రోగిని కొరాపుట్ తరలించారు. ప్రభుత్వ సాహిద్ లక్ష్మణ్ నాయక్ వైద్య కళాశాలకి రోగి సకాలంలో చేరడంతో ప్రమాదం తప్పింది. కానీ మరమ్మతులకు గురైన అంబులైన్స్‌కి సుమారు 15 కాల్స్ వచ్చినా ఘాట్ రోడ్డు లోనే ఉండి పోయింది. పట్టంచు కోనే వారు లేక అంబులైన్స్ డ్రైవర్ ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ 108 అంబులైన్స్ వాహనాల పనితీరుపై విమర్శలు రేగుతున్న వేళ ఈ ఘటన చోటు చేసుకుంది.