
భారీగా గంజాయి స్వాధీనం
కొరాపుట్: కొరాపుట్ జిల్లా పోలీసులు భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం కొరాపుట్ జిల్లా బొయిపరిగుడ సమితి కుర్లగుడ జంక్షన్ వద్ద పోలీసులు తనిఖీలు చేశారు. కూరగాయల లోడుతో వెళ్తున్న వ్యాన్ కింది భాగాన క్వింటాల్ గంజాయి పట్టుబడింది. ఈ వ్యాన్‌లో ఉన్న నబరంగ్‌పూర్ జిల్లా రాయగర్‌సమితికి చెందిన రాజు మండల్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కృష్ణ సింగ్, హర్తిక్ చౌహాన్‌లను అరెస్ట్ చేశారు. మల్కన్‌గిరి జిల్లా బలిమెలలో గంజాయి కొనుగోలు చేసి ఉత్తర్ ప్రదేశ్ రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బొయిపరిగుడ ఓఐసీ డొంబురుధర్ బట్రియా, ఎస్‌ఐ ధీరేంద్ర బారిక్‌లు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కూరగాయల వాహనంలో గంజాయి
జయపురం: జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడ పోలీసులు కూరగాయలు రవాణా చేస్తున్న వ్యాన్‌లో గంజాయి పట్టుకున్నారు. శనివారం మల్కన్‌గిరి జిల్లా బలిమెల నుంచి కుడుములుగుమ్మ, బొయిపరిగుడల మీదుగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి గంజాయి రవాణా జరుగుతోందని, ఓ వ్యాన్‌లో గంజాయి తరలిస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు ఏఎస్‌ఐ ధీరేంధ్ర బారిక్ నేతృత్వంలో ఒక టీమ్‌ను పంపిచామని బొయిపరిగుడ పోలీసు అధికారి డొంబురు బత్రిక తెలిపారు. వ్యాన్‌ను అడ్డుకుని తనిఖీ చేయగా గంజాయి దొరికిందని, వ్యాన్‌ను స్వాధీనం చేసుకుని ముగ్గురు నిందితులను అరెస్టు చేశామన్నారు. వారిలో ఒకరు నవరంగపూర్ జిల్లా రాయగర్ వాసి రాజు మండల్ కాగా ఇద్దరు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వాసులు కృష్ణ సింగ్,హితిక్ చౌహాన్‌లు అని పోలీసు అధికారి వెల్లడించారు. వారిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
గంజాయితో వ్యక్తి అరెస్టు
జయపురం: జయపురం రైల్వే స్టేషన్ సమీప ప్రాంతంలో జయపురం అబ్కారి సిబ్బంది దాడి జరిపి ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. అతడి వద్ద 4.1 కిలోల గంజాయి పట్టుకున్నట్లు జయపురం అబ్కారి సటేషన్ అధికారి శుబ్రత్ కేశరీ హిరన్ వెల్లడించారు. అరెస్టయిన వ్యక్తి కేరళ రాష్ట్ర తిరువనంతపూర్ జిల్లా పుబర పోలీసు స్టేషన్ పరిధి కొలురు గ్రామం బయిజు జెమ్స(48) అని వెల్లడించారు. నిందితుడు ఈ ప్రాంతంలో చట్ట విరుద్ధంగా ఎక్కడో గంజాయి కొని బెగ్‌లో భధ్ర పరచి రైలులో విశాఖపట్నం, అక్కడి నుంచి కేరళకు వెళ్లేందుకు జయపురం రైల్ స్టేషన్ ప్రాంతంలో వేచి ఉన్నాడని తెలిపారు.

భారీగా గంజాయి స్వాధీనం