
ఉత్సాహంగా పోషణ వేడుకలు
పర్లాకిమిడి: జిల్లా స్థాయి రాష్ట్రీయ పోషణ మాసోత్సవాన్ని స్థానిక కలెక్టరేట్ కాన్ఫరెన్సు హాల్‌లో శనివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా ఆదనపు మేజిస్ట్రట్ ఫాల్గునీ మఝి, జిల్లా సామాజిక సంక్షేమ శాఖ అధికారి మనోరమా దేవి, మిషన్ శక్తి డైరెక్టర్ టిమోన్ బోరా, ప్రోగ్రాం, ప్రోటెక్షన్ అధికారి శారదా పట్నాయక్, పీవో సునీతా రోథ్ పాల్గొన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో బాలలకు నెల రోజుల పాటు పోషకాహారం అందించాలని ఏడీఎం ఫల్గునీ మఝి సూచించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ హాల్ బయట అంగన్‌వాడీ వర్కర్లు పోషక విలువల కలిగిన కాయగూరలు, వంటల ప్రదర్శన స్టాల్ నిర్వహించారు. ఈ నెల 16వ తేదీ వరకూ జిల్లాలోని అన్ని సమితి కేంద్రాల్లో రాష్ట్రీయ పోషణ మాసోత్సవాలను నిర్వహిస్తామని ప్రోగ్రాం ఆఫీసర్ శారదా పట్నాయక్ తెలిపారు.