
‘బాలికలపై వివక్ష సరికాదు’
రాయగడ: బాలికలపై వివక్ష చూపడం సరికాదని కలెక్టర్ అశుతోష్ కులకర్ణి అన్నారు. స్థానిక డీఆర్‌డీఏ సమావేశం హాల్‌లో శనివారం జరిగిన అంతర్జాతీయ కన్యా దినోత్సవ కార్యక్రామానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. కన్యా శిశువుల సంరక్షణ, వారిని విద్యావంతులను చేయడం, అన్ని రంగాల్లో ప్రోత్సహించడం అందరి కర్తవ్యమని పేర్కొన్నారు. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అడుగులు వేస్తోందని, వారి సంరక్షణ కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని వివరించారు. సమాజాభివృద్ధికి కన్యా శిశువుల పాత్ర చాలా కీలకమని ఉద్బోధించారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా సామాజిక సురక్షా అధికారి మీనతీ దేవ్ మాట్లాడుతూ అనేక ఆందోళనలు, పోరాటాల ఫలితంగా 1920 నుంచి మహిళలకు ఓటు హక్కు దక్కిందని అన్నారు.

‘బాలికలపై వివక్ష సరికాదు’