
320 మంది దివ్యాంగుల గుర్తింపు
జయపురం: జయపురం సబ్‌డివిజన్ కుంద్ర సమితిలో భీమభొయి వికలాంగ పథకంలో దివ్యాంగుల గుర్తింపు శిబిరాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ శిబిరంలో సమితి అధ్యక్షు లు తరుణసేన్ బిశాయి ముఖ్యఅతిథిగా పాల్గొ ని శిబిరాన్ని ప్రారంభించారు. గౌరవ అతిథులు గా జిల్లా పరిషత్ అధ్యక్షుడు రాదాబినోద్ సామంతరాయ్, బీడీఓ పి.మనశ్మిత, కొట్‌పాడ్ ఎమ్మెల్యే ప్రతినిధి బద్రి నారాయణ ఆచార్యతో పాటు సమితి సభ్యులు, సర్పంచ్‌లు పాల్గొన్నా రు. శిబిరంలో 320 మందిని గుర్తించినట్లు తెలిపారు. వీరికి గుర్తింపు కార్డులు అందజేశారు. శిబిరంలో వైద్య నిపుణులు డాక్టర్ ఎస్.ఎస్.మిశ్ర, డాక్టర్ దేవాశిశ్ మహాపాత్రో, శివానంద బుద్దియ, కిశాన్ కుమార్ సాహు, లలటేందు మిశ్ర, సవ్య సాచి మహాపాత్రో పాల్గొన్నారు.
పర్లాకిమిడి: స్థానిక శ్రీక్రిష్ణచంద్ర గజపతి కళాశాల ప్రిన్సిపల్‌గా రాధాకాంత భుయ్యాన్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. భుయ్యాన్ ఎస్‌కేసీజీ కళాశాలలో హిస్టరీ అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. రాధాకాంత భుయ్యాన్ స్వస్థ లం గజపతి జిల్లాలో రాయఘడ బ్లాక్. భు య్యాన్ బరంపురం విశ్వవిద్యాలయంలో చరి త్ర సబ్జెక్టులో పోసు్ట్రగాడ్యుయేషన్ చేసి 1996– 98లో గంజాం జిల్లా కోనిసి, ఛత్రపురం ప్రభు త్వ కళాశాలల్లో కొన్నాళ్లు పని చేసి పర్లాకిమిడి కళాశాలకు బదిలీ అయ్యి వచ్చారు.రాధాకాంత భుయ్యాన్ పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా కళాశాల అధ్యాపకులు, పాత విద్యా ర్థుల సంఘం అధ్యక్షులు శంకర్ ప్రసాద్ భక్షి, శశిభూషన్ పాఢి, బసంత్ పండా తదితరులు అభినందనలు తెలియజేశారు.
మల్కన్‌గిరి: స్కౌట్స్‌పై అవగాహన పెంచాలని వక్తలు అన్నారు. మల్కన్‌గిరి మహిళా మాధ్యమిక మహావిద్యాలయంలో జిల్లా స్థాయి స్కౌ ట్ గైడ్‌పై ప్రాథమిక చర్చా కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. జిల్లా విద్యాశాఖాధికారి చిత్తరంజన్ పాణిగ్రాహీ అధ్యక్షత జరిగిన కార్య క్రమాన్ని ముఖ్యఅతిథిగా రాష్ట్ర శిక్షణ కమిషనర్ సురజిత్ సేన్, గౌరవ అతిథులుగా అదనపు జిల్లా విద్యాశాఖ అధికారి భగీరధీ బెహేరా, అదనపు విద్యాధికారిణి మంజులతా భోయి, కళాశాల అధ్యక్షుడు దుష్మంత్ కుమార్ జేనా, జిల్లా శారీరక విద్యాధికారి కార్తిక చంధ్ర బెహర పాల్గొన్నారు. 250 మంది ఉపాధ్యాయులు హాజరవ్వగా.. వీరికి స్కౌట్ గైడ్‌పై అవగాహన కల్పించారు.
ఎచ్చెర్ల : ఏపీఈఏపీ సెట్–2025 ప్రవేశ పరీక్షకు హాజరైన బైపీసీ విద్యార్థులకు సంబంధించి బీ–ఫార్మశీ, ఫార్మా–డీ, బయో/ఫుడ్ టెక్నాలజీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు వెబ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైందని జిల్లా ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాల ప్రిన్సిపాల్, సహాయక కేంద్రం జిల్లా సమన్వయకర్త కె.నారాయణరావు శుక్రవారం తెలిపారు. తొలి విడతగా ఈ నెల 12 నుంచి 18వరకు, తుది విడతగా ఈ నెల 25 నుంచి 29 వరకూ ధ్రువపత్రాల పరిశీలన జరుగుతాయని పేర్కొన్నారు. 21న సీట్ల కేటాయింపు ఉంటుందని, వివరాలకు పాలిటెక్నిక్ కళాశాలలోని సహాయ కేంద్రంలో సంప్రదించాలని కోరారు.
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అమలు పకడ్బందీగా చేపట్టాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన జిల్లా స్థాయి విజిలెన్‌న్స్, మానిటరింగ్ కమిటీ సమావేశంలో ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, కమిటీ సభ్యులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ వివిధ స్థాయిల్లో పెండింగ్‌లో ఉన్న అట్రాసిటీ కేసుల పరిష్కారానికి అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. పలు కేసుల్లో మూడు నెలల్లో బాధితులకు రూ.18 లక్షల వరకు పరిహారం చెల్లించామన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు కూన రవికుమార్, బగ్గు రమణమూర్తి, గొండు శంకర్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, ఏఎస్పీ శ్రీనివాసరావు, ఆర్డీవో సాయి ప్రత్యూ ష, డీఎస్పీ సీహెచ్.వివేకానంద, సోషల్ వెల్ఫేర్ డీడీ మధుసూదనరావు, బీసీ కార్పొరేషన్ ఈడీ గెడ్డమ్మ, బీసీ సంక్షేమాధికారి అనురాధ, కమిటీ సభ్యులు గేదెల రమణమూర్తి, దాసరి తిరుమలరావు మాదిగ, దండాసి రాంబాబు, తోట రాములు తదితరులు పాల్గొన్నారు.

320 మంది దివ్యాంగుల గుర్తింపు

320 మంది దివ్యాంగుల గుర్తింపు