
బీజేడీ ఆందోళన
కొరాపుట్: మహిళలపై జరుగుతున్న దురాఘాతాల ను అడ్డుకోవాలని ప్రతిపక్ష బీజేడీ ఆందోళన బుధవారం చేసింది. నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, డాబుగాం ఎమ్మెల్యే మనోహర్ రంధారి నివాసం నుంచి ఎస్పీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. బీజేడీ ముఖ్య నాయకులు తన గదికి రావాలని ఎస్పీ మడకర్ సంపత్ సూచించారు. ఇప్పటివరకు తీసుకున్న చర్యలను బీజేడీ నాయకులకు ఎస్పీ వివరించారు. ఇంకేం చర్యలు తీసుకోవాలో సూచించాలని కోరారు. జిల్లాలో మహిళల రక్షణ కోసం బీజేడీ నాయకులు సూచన లు చేశారు. వారు చెప్పిన అన్ని రక్షణ చర్యలూ వెంటనే తీసుకొంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. ఎస్పీకి బీజేడీ నాయకులు వినతిపత్రం అందించారు. మా జీ ఎమ్మెల్యేలు సదాశివ ప్రధాని, సుభాష్ గోండో, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ మంజులా మజ్జి, మాజీ జెడ్పీ వైస్ ప్రెసిడెంట్ నివేదిత మహాంతి, కౌసల్య ప్రధాని, రబి పట్నాయక్ పాల్గొన్నారు.