
ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతదేహం లభ్యం
భువనేశ్వర్: మహిళా ట్రాఫిక్ కానిస్టేబుల్ శుభ మిత్ర సాహు ఈ నెల 6వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది. కెంఝొహర్ ఘొటొగాంవ్ అటవీ ప్రాంతంలో ఆమె మృతదేహం బుధ వారం లభ్యమైంది. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పనిచేస్తున్న ఆమె స్నేహితుడు గుమాస్తా దీపక్ రౌత్ పట్ల తలెత్తిన సందేహం ప్రాథమికంగా రుజువు అయింది. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ప్రాథమిక విచారణలో తేలిన ఆధారాలతో పోలీసులు నిందితుడు దీపక్ రౌత్‌ను శుభమిత్ర మృత దేహాన్ని వెలికితీసేందుకు కెంఝొహర్ ఘొటొగాంవ్ అటవీ ప్రాంతంలో పాతిపెట్టిన ప్రదేశానికి భువనేశ్వర్ నుంచి తీసుకెళ్లారు. పోలీసులు, మేజి స్ట్రేట్ సమక్షంలో జేసీబీ సహాయంతో తవ్వి శుభమిత్ర మృతదేహాన్ని బయటకు తీశారు. సిమెంట్ సంచిలో కట్టిన మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.