
నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు
కొరాపుట్: ఇంద్రావతి మెగా హిల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణంలో నాసిరకంగా పనులు జరిగితే ఉపేక్షించబోమని బీజేపీకి చెందిన నబరంగ్‌పూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి హెచ్చరించారు. బుధవారం ఇంద్రావతి ప్రాంతంలో రెండు కొండల మధ్య నిర్మా ణం జరుగుతున్న ప్రాంతాన్ని సందర్శించారు. ఈ నిర్మాణంపై దాదాపు నాలుగు దశాబ్దాలుగా ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే తెంతులకుంటి, నందాహండి, నబరంగ్‌పూర్ సమితుల్లో 19 వేల హెక్టార్లకు సాగునీరు అందుతుందన్నారు. ఇంతవరకు ఈ ప్రాంతంలో ఏడాదికి ఒకే పంట పండించే రైతులు ఖరిఫ్‌తోపాటు, రబీలో కూడా పంటలు వేసుకోవచ్చన్నారు. ప్రాజెక్ట్‌కి అనుసంధానం చేసే రోడ్లు, అక్కడ నిర్మితం అవుతున్న భవనాలు, తదితర ప్రాంతాలను సందర్శించారు. కొత్త నిర్మాణాలకు భూమి పూజ చేశారు. తాను ఈ నిర్మాణ పురోగతిని పరిశీలిస్తుంటానన్నారు.

నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు