
నాల్కో వద్ద ఉద్రిక్త పరిస్థితులు
కొరాపుట్: భారత అల్యూమినియం కేంద్రం (నాల్కో) వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సోమవారం కొరాపుట్ జిల్లా దమంజోడిలో నాల్కో ప్రధాన ద్వారం వద్ద నిర్వాసితులు బైఠాయించారు. ఈ ప్రాంతంలో అల్యూమినియం శుద్ధి కేంద్రం ఏర్పాటు చేసినప్పుడు తమ భూములు ప్రభుత్వం తీసుకుందన్నారు. నాడు ఉపాధి కల్పిస్తామని చెప్పి చిన్న చిన్న ఉపాధి పనులు కల్పించారన్నారు. తాము భూమిని నమ్ముకున్న ఆదివాసీలమని గుర్తు చేశారు. తరతరాలుగా వంశ పారపర్యంగా భూమి సాగు చేసుకుంటున్నామని అన్నారు. కానీ నాడు భూమి తీసుకున్నప్పడు నిర్వాసితులకు చిన్న చిన్న ఉపాధి పనులు ఇచ్చి చేతులు దులుపు కున్నారని, ఉపాధి పొందిన వారు చనిపోయాక వారి కుటుంబంలో అర్హత ఉన్న వారికి కూలి పనులు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తాము రోడ్డున పడ్డామన్నారు. తమకు వ్యవసాయం లేదా కూలి పనులు మాత్రమే తెలుసని అన్నారు. ఈ రెండు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. ఈ సమస్యపై తాము ఎన్నిసార్లు నాల్కో ఉన్నతాధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని తెలిపారు. ప్రధాన ద్వారం ముందు బైఠాయించారు. పరిశ్రమ లోపల ఉన్న వారు బయటకు రాలేక పోయారు. ముడి బాకై ్సట్ తో వచ్చిన వాహనాలు నాల్కో బయట ఉండి పోయాయి. వీరికి సంఘీభావంగా పొట్టంగి మాజీ ఎమ్మెల్యే పీతం పాడి ఆందోళనలో పాల్గొన్నారు. పోలీసులు వచ్చి సర్ది చెప్పినా వారు ఆందోళన విరమించలేదు.

నాల్కో వద్ద ఉద్రిక్త పరిస్థితులు

నాల్కో వద్ద ఉద్రిక్త పరిస్థితులు