
గుమ్మఘాటీలో బస్సు ప్రమాదం
● 8 మందికి గాయాలు
రాయగడ: గుణుపూర్ నుంచి జయపురానికి వెళ్లే గోల్డెన్ రాక్ ప్రైవేటు బస్సు సోమవారం తెల్లవారు ఝామున ప్రమాదానికి గురైంది. సదరు సమితి పరిధిలో గల గుమ్మ ఘాటీ మలుపులో అదుపుతప్పిన బస్సు రోడ్డు పక్కకు దూసుకువెళ్లిపొవడంతొ బస్సులో ప్రయాణిస్తున్న 40 మంది ప్రయాణికుల్లో 8 మంది గాయాలపాలయ్యారు. గుమ్మఘాటి మలుపు దిగుతున్న సమయంలో బస్సు అదుపు తప్పడంతో రోడ్డు సైడుకు దూసుకుపోయింది. డ్రైవరు చాకచక్యంతో వ్యవహరించి బస్సును అదుపు చేయడంతొ పెను ప్రమాదం తప్పింది. గుణుపూర్ నుంచి సొమవారం అర్ధరాత్రి బయల్దేరిన బస్సు గుమ్మఘాటి దిగుతున్న సమయంలో ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగాక అంబులెన్స్ రాకపోవడంతో క్షతగాత్రులను పోలీసులు, స్థానికులు జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు.

గుమ్మఘాటీలో బస్సు ప్రమాదం

గుమ్మఘాటీలో బస్సు ప్రమాదం

గుమ్మఘాటీలో బస్సు ప్రమాదం