
అంత్యక్రియలకు తీసుకువస్తే..
భువనేశ్వర్:
పూరీ సాగర తీరం స్వర్గ ద్వారంలో అంత్యక్రియలు స్వర్గలోక ప్రాప్తికి సోపానంగా భావిస్తారు. ఈ క్రమంలో గంజాం జిల్లా నుంచి ఓ వృద్ధ మహిళని అంత్యక్రియల కోసం తీసుకువచ్చారు. దహనకాండ సన్నాహాలు జరుగుతుండగా ఆమె ఒక్కసారిగా కళ్లు తెరిచారు. దీంతో అంతా అవాక్కయ్యారు. కాసేపట్లో ఆమె ప్రాణాలతో బతికే ఉన్నట్లు భావించి హుటాహుటిన అంబులెన్సులో స్థానిక జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె జీవించి ఉన్నట్లు ధ్రువీకరించారు. పాడిపైనుంచి కళ్లు తెరిచి కోలుకున్న వృద్ధ మహిళ గంజాం జిల్లా పొలొసొరొ కె.నువాగాంవ్ ప్రాంతానికి చెందిన 86 ఏళ్ళ పి. లక్ష్మిగా గుర్తించారు. ప్రస్తుతం ఈమె పూరీ జిల్లా ప్రధాన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఏమై ఉంటుంది ..
స్వర్గ ద్వారం శ్మశాన వాటికలో అంత్యక్రియల నిర్వహణకు సంబంధిత మృత వ్యక్తి మరణ ధ్రువీకరణ పత్రం అనివార్యం. మృత వ్యక్తి ఆధార్ కార్డు కూడా అవసరం ఉంటుంది. దాని ఆధారంగా వివరాలు నమోదు చేసిన మేరకు దహనకాండకు అనుమతిస్తారు. కానీ ఈమెకు చెందిన పత్రాలు తీసుకురాలేదు.