
బస్సు ఓనర్ల సంఘ వార్షిక సమావేశం
పర్లాకిమిడి: గజపతి ప్రైవేటు బస్సు ఓనర్లు సంఘం వార్షిక సాధారణ సమావేశం స్థానిక పీడబ్ల్యూడీ.బంగ్లాలో శుక్రవారం జరిగింది. ఈ సమావేశానికి సంఘం కార్యదర్శి ఇంజా వెంకట రమణ అధ్యక్షత వహించగా అధ్యక్షులు ఛిత్రి సింహాద్రి గత సమావేశం వివరాలు వెల్లడించారు. ముఖ్యంగా బస్సు ఓనర్లు ఆర్‌టీవో అధికారుల వల్ల ఎదుర్కుంటున్న సమస్యలను పలువురు ఓనర్లు కార్యదర్శి దృష్టికి తీసుకొచ్చారు వివరించారు. అలాగే ప్రస్తుత సంఘం కార్యవర్గం వచ్చే ఏడాది జనవరి 31 వరకూ కొనసాగించేలా సభ్యులంతా ఏకగ్రీవంగా తీర్మానించారు. సమావేశంలో ఉపాధ్యక్షులు డి.గజపతిరాజు, కిల్లారి యుగంధర్, కోశాధికారి గణేష్ సాహుకార్, పి.రాంబాబు, శ్రీను సాహుకార్, కిల్లారి గోపి, ఇంజా రవి పాల్గొన్నారు.

బస్సు ఓనర్ల సంఘ వార్షిక సమావేశం