
భూతల స్వర్గం కొరాపుట్
గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు
దేవమాలి పర్యాటక కేంద్రం సందర్శన
కొరాపుట్: ప్రకృతి అందాలతో నిండిన కొరాపుట్ జిల్లా భూతల స్వర్గం వంటిదని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు అభివర్ణించారు. కొరాపుట్ జిల్లా పొట్టంగి సమితి దేవమాలి అంతర్జాతీయ ప్రాకృతిక పర్యాటక కేంద్రాన్ని బుధవారం సందర్శించారు. మేఘాలు కొండలను తాకుతూ వెళ్తున్న దృశ్యాలు వీక్షించారు. అనంతరం మొక్క నాటారు. దేవమాలిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై దిశా నిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూ.20 వేల కోట్లతో విశాఖపట్నం–రాయ్‌పూర్ మధ్య నిర్మిస్తున్న ఆరు అంచెల ఎకనామిక్ కారిడార్‌ని సందర్శించారు. ఈస్ట్రన్ ఘాట్స్‌ను చీల్చుకుంటూ నిర్మించిన భారీ టన్నెల్‌లో పర్యటించారు. సొరంగం ప్రాముఖ్యతను ఎన్‌హెచ్ అధికారులు గవర్నర్‌కు వివరించారు. సునాబెడలో హిందూస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ (హాల్)ని సందర్శించి అక్కడ సుఖోయ్ యుద్ధ విమానాల ఇంజిన్ల తయారీ విభాగం పరిశీలించారు. ఉన్నత స్థాయి అధికారులతో చర్చలు జరిపారు. పుంగార్‌లోని ఏకలవ్య మోడల్ విద్యాలయం బాలలతో సంభాషించారు. కేంద్రియ విశ్వ విద్యాలయంలో ఉన్నత స్థాయి అధికారుల నియామకం చాలా కాలంగా జరగకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. కొరాపుట్‌లో పలు సంస్థల ప్రతినిధులు ప్రభుత్వ సాహిద్ లక్ష్మణ్ నాయక్ వైద్య కళాశాల అభివృద్ధిపై వినతి పత్రాలు సమర్పించారు. కొన్ని చోట్ల గిరిజనులను పలకరించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పర్యటనలో కలెక్టర్ సత్యావాన్ మహాజన్, ఎస్‌ఫి రోహిత్ వర్మ తదితరులు న్నారు.

భూతల స్వర్గం కొరాపుట్