
టాయిలెట్‌లో ప్రసవం
మల్కన్‌గిరి: కలిమెల సమితి ఆరోగ్య కేంద్రంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నలగ్రంధి గ్రామానికి చెందిన పాడియా కస్బ భార్య సింఘే కస్బకు నెలలు నిండటంతో సోమవారం సాయంత్రం కలిమెల ఆరోగ్య కేంద్రానికి వచ్చింది. ఆమెను పరీక్షించిన వైద్యులు మంగళవారం ప్రసవం జరుగుతుందని చెప్పారు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున టాయిలెట్‌కు వెళ్లిన సమయంలో మగబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ లెట్రిన్ ట్యాంక్‌లో చిక్కుకోవడంతో ఓ మహిళ వచ్చి బిడ్డను బయటకు తీసింది. వెంటనే వైద్యులు చికిత్స అందించడంతో తల్లీబిడ్డలు కోలుకున్నారు.