
ఖరీఫ్ రుణాలు రూ.514 కోట్లు
జయపురం: కొరాపుట్ కేంద్ర సహకార బ్యాంక్ జయపురం (కె.సి.సి.బ్యాంక్) ఖరీఫ్ సీజన్‌లో రైతులకు రూ.645 కోట్ల మేరకు రుణాలను ఇచ్చేందుకు లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు రూ.514 కోట్లు అందజేసినట్లు బ్యాంకు వర్గాలు వెల్లడించాయి. అవిభక్త కొరాపుట్ జిల్లాలోని రాయగడ, మల్కనగిరి, నవరంగపూర్, కొరాపుట్‌లలో 20 శాఖలు ఉండగా మల్కనగిరి జిల్లా మత్తిలి, బలిమెల కేసీసీ శాఖలు రైతులకు రుణాలు మంజూరు చేయడంలో నూరు శాతం లక్ష్యాన్ని అధికారులు తెలిపారు. ఈ నెల 30లోగా అన్ని బ్రాంచ్‌లు వంద శాతం లక్ష్యం చేరుకోవాలని చెప్పారు.
కూలిన తరగతి గది పైకప్పు
భువనేశ్వర్: స్థానిక యూనిట్–9 బాలుర ఉన్నత పాఠశాల సముదాయంలో బుధవారం తరగతి గది పైకప్పు పెచ్చులు ఊడి రాలాయి. అదృష్టవశాతు ఈ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోలేదు. బుధవారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో తరగతి గది పైకప్పు నుంచి పెచ్చులు ఊడి నేలకు రాలాయి. ఇటీవల 5టీ చొరవ కింద ఈ పాఠశాలను పునరుద్ధరించారు.
340 కిలోల గంజాయి పట్టివేత
మల్కన్‌గిరి: ఎకై ్సజ్ సిబ్బంది దాడుల్లో 340 కిలోల గంజాయి పట్టుబడింది. మల్కన్‌గిరి జిల్లా ఎకై ్సజ్‌శాఖ అధికారి బింభధర్ పండా ఆదేశాలతో మంగళవారం రాత్రి ప్రత్యేక బృందం చిత్రకొండ సమితి పెప్పరమేట్ల పంచాయతీ సారుకుబొంద గ్రామ అటవీ ప్రాంతంలో దాడులు నిర్వహించారు. ఈ ప్రాంతం నుంచి గంజాయి అక్రమ రవాణా జరుతుందనే ముందస్తు సమాచారంతో ఎకై ్సజ్ అధికారి బింబధర్ తన సిబ్బందిని పంపారు. అయితే ఎకై ్సజ్ సిబ్బంది రాకను గమనించి గంజాయి మాఫీయ బస్తాలతో రవాణాకు సిద్ధంగా ఉంచిన గంజాయి విడిచిపెట్టి అక్కడ నుంచి పరారైంది. స్వాధీనం చేసుకున్న గంజాయి బస్తాలను ఎక్సెజ్ సిబ్బంది చిత్రకొండ కార్యాలయానికి తరలించారు. బుధవారం తహసీల్దార్ సమక్షంలో చిత్రకొండ ఎక్సెజ్ ఇన్‌స్పెక్టర్ సంతోష్ కుమార్ బళ ఇతర సిబ్బంది కలిసి గంజాయిని తూకం వేయగా 340 కేజీలు ఉన్నట్టు నిర్ధారించారు. దీని విలువ 35 లక్షల రూపాయలు ఉంటుందని అధికారులు వెల్లడించారు.
ముగిసిన జూనియర్ రెడ్‌క్రాస్ శిక్షణ శిబిరం
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి సమితి ఎంవీ–7 గ్రామం వద్ద జగన్నాధపల్లి ఉన్నత పాఠశాలలో మూడు రోజులు జరిగిన జిల్లాస్థాయి రెడ్‌క్రాస్ శిక్షణ శిబిరం మంగళవారంతో ముగిసింది. చివరి రోజున ముఖ్యఅతిథిగా జిల్లా విద్యాశాఖాధికారి చిత్తరంజన్ పాణిగ్రహి హాజరై మాట్లాడారు. శిక్షణలో ఇచ్చిన విషయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో పీటీ కార్తీక్ చంద్ర బెహరా, జిల్లా జూనియర్ రెడ్‌క్రాస్ కోఆర్డినేటర్ దేవరాజ్ సేఠీ పాల్గొన్నారు. శిక్షణ పొందిన 61 మందికి ప్రశంసా పత్రాలను అందజేశారు.

ఖరీఫ్ రుణాలు రూ.514 కోట్లు

ఖరీఫ్ రుణాలు రూ.514 కోట్లు

ఖరీఫ్ రుణాలు రూ.514 కోట్లు