
పోక్సో, నల్సా చట్టాలపై అవగాహన
పర్లాకిమిడి: స్థానిక మహేంద్రగిరి పురపాలక ఉన్నత పాఠశాలలో బుధవారం పోక్సో, నల్సా చట్టం– 2018పై విద్యార్థులకు అవగాహన శిబిరాన్ని జిల్లా న్యాయ సేవా ప్రాధికరణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. జిల్లా న్యాయ సేవా ప్రాధికరణ కార్యదర్శి బిమల్ రవుళో, పబ్లిక్ ప్రాసిక్యూటర్ (జిల్లా కోర్టు) రాజేష్ కుమార్ మిశ్రాలు మాట్లాడారు. పోక్సో చట్టం ద్వారా విద్యార్థినులు, మైనర్ బాలికలపై లైంగిక దాడులు జరిగితే కోర్టులు ఎలా ప్రతిస్పందిస్తాయి, వారికి తగిన విధంగా న్యాయం చేకూర్చడమే కాకుండా నల్సా చట్టం కింద పీడిత మైనర్ బాలికలకు నష్ట పరిహారం ఇప్పించడంపై డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి బిమళ్ రవుళో వివరించారు. సమావేశంలో సీనియర్ ఆడ్వకేట్ ఆర్.బాబూరావు, బి.చిట్టిబాబు, బార్ అసోసియేషన్ సభ్యులు డి.అనుప్ కుమార్, ప్రధాన ఉపాధ్యాయులు పూర్ణచంద్ర ప్రధాన్ పాల్గొన్నారు.

పోక్సో, నల్సా చట్టాలపై అవగాహన