
గ్రహణం సమయంలో శ్రీ జగన్నాథుని విశేష దర్శనం
సోమవారం శ్రీ 8 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
న్యూస్‌రీల్
● మూతబడిన ఆలయాలు
మజ్జిగౌరి అమ్మవారికి హారతి సమర్పించిన అనంతరం గర్భగుడికి తాళం వేస్తున్న పూజారులు
రోడ్డు ప్రమాదంలో
యువకుడి దుర్మరణం
రాయగడ: రోడ్డు ప్రమాదంలో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. జిల్లాలోని రామనగుడలో శనివారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనలో గజపతి జిల్లాకు చెందిన కొరాయి మోహన్ (40) మృత్యువాత పడ్డాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. తన అత్తవారింటికి బైక్‌పై మోహన్‌ను గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటనలో మోహన్ తీవ్రగాయాలకు గురయ్యాడు. స్థానికులు రామనగుడ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.
పాముకాటుతో మహిళా సర్పంచ్ మృతి
రాయగడ: సదరు సమితి కూలి పంచాయతీ సర్పంచ్ మంగి కడ్రక (32)పాముకాటుతో ప్రాణాలు కోల్పోయారు. శనివారం రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా.. అర్ధరాత్రి సమయంలో ఆమెకు విషపూరితమైన పాము కాటు వేసింది. దీంతో గ్రామస్తులు ఆమెను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
కాలువలో చిక్కుకున్న
గున్న ఏనుగు
భువనేశ్వర్: గుంపులో తప్పిన గున్న ఏనుగు కాలువలోకి జారింది. బయటకు రాలేక కొన్ని గంటల పాటు తంటాలు పడింది. అటవీ శాఖ అధికారుల తేలికపాటి చర్యలతో గున్న ఏనుగు సురక్షితంగా గట్టెక్కింది. ఆదివారం ఢెంకనాల్ సదర్ రేంజ్ హలాదియాబహల్ సమీపంలోని రెంగాలి కాలువలోకి గున్న ఏనుగు జారి పడింది. నీటి పోటుతో కొన్ని గంటలపాటు తల్లడిల్లింది. స్థానికుల సమాచారంతో అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలం చేరి కాలువలో చిక్కుకున్న గున్న ఏనుగు సురక్షితంగా బయటకు తీశారు. ఈ ఏనుగు వయసు 5 ఏళ్లు ఉంటుందని అంచనా. సురక్షితంగా గట్టెక్కిన గున్న ఏనుగు చురుగ్గా హలదియాబహల్ సమీపంలోని అటవీ ప్రాంతం వైపు పరుగులు తీసింది.
వ్యక్తి ఆత్మహత్య
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా పోడియా సమితి ఎంపీవీ 66 గ్రామానికి చెందిన వాసుదేవ్ మిశ్రి (40) అనే వ్యక్తి శనివారం రాత్రి తన ఇంటిలో శ్లాబ్‌కు ఉన్న హుక్కుకు తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటిలో అంతవరకు అందరితో కలివిడిగా ఉన్న వ్యక్తి అర్ధరాత్రి ఉరి వేసుకున్నాడు. ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులకు వాసుదేవ్ కనిపించకపోవడంతో గదిలోకి వెళ్లి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
క్రికెట్ విజేతగా కలెక్టరేట్ జట్టు
పర్లాకిమిడి: డి.ఎం.గజపతి (కలెక్టరేట్) టీమ్, బంధన్ బ్యాంకు టీమ్‌ల మధ్య బంధుత్వ క్రికెట్ మ్యాచ్ ఆదివారం ఉదయం స్థానిక శ్రీకృష్ణచంద్రగజపతి కళాశాల మైదానంలో జరిగింది. ఈ మ్యాచ్‌కు ముఖ్యఅతిథులుగా అదనపు జిల్లా మాజిస్ట్రేట్ ఫల్గునీ మఝి, సబ్ కలెక్టర్ అనుప్ పండా విచ్చేశారు. తొలిత టాస్ గెలిచిన జిల్లా యంత్రాంగం జట్టులో సబ్ కలెక్టర్ అనుప్ పండా 27 రన్స్ చేశారు. మొత్తం 9 వికెట్లు కోల్పోయి 115 రన్స్ చేశారు. బరిలోకి దిగిన బంధన్ బ్యాంకు టీమ్ 106 పరుగులు చేసింది. మ్యాన్ ఆఫ్ దీ మ్యాచ్‌గా క్రాంతి (29 పరుగులు)కి అందజేశారు. బంధన్ బ్యాంకు క్లస్టర్ హెడ్ స్థితప్రగ్య దాస్, బ్రాంచ్ మేనేజర్ రామకృష్ణ పాడీ, తదితరులు పాల్గొన్నారు.
మూసివేసిన బాలాజీనగర్‌లోని కళ్యాణ
వేంకటేశ్వర మందిరం
గ్రహణం ఎఫెక్ట్
రాయగడ: చంద్ర గ్రహణం ప్రభావంతో ప్రముఖ మందిరాలతో పాటు అన్ని మందిరాలు ఆదివారం మూతపడ్డాయి. ఇందులో భాగంగా ఉత్కళాంధ్రుల ఆరాధ్య దైవంగా పూజలందుకుంటున్న మజ్జిగౌరి మందిరాన్ని ఉదయం 11.10 గంటలకు మూసి వేశారు. అమ్మవారికి మధ్యాహ్నం అన్నభోగంతో పాటు హారతిని సమర్పించి అమ్మవారి గర్భగుడితో పాటు ప్రధాన ద్వారాలను మూసి వేశారు. అయితే కొందరు భక్తుల దర్శనం కోసం వచ్చినప్పటికీ మందిరాన్ని మూసివేసిన కారణంగా ఆరుబయట నుంచి మొక్కలు చెల్లించుకుని తిరిగి వెళ్లిపోవడం కనిపించింది. అలాగే స్థానిక బాలాజీనగర్‌లోని కళ్యాణ వేంకటేశ్వర మందిరం పూజా కార్యక్రమాలను నిర్వహించిన ప్రధాన అర్చకులు భాస్కరాచార్యులు అనంతరం మందిరాన్ని మూసివేశారు. బ్రాహ్మణవీధిలోని కొదండరామ మందిరం, పీహెచ్‌డీ కాలనీ వద్ద గల బాలింకేశ్వర ఆలయాలను కూడా మూసివేశారు. సోమవారం ఉదయం సంప్రోక్ష అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు.
భువనేశ్వర్: పూరీ శ్రీ జగన్నాథుని దేవస్థానంలో అడుగడుగునా విభిన్నత ప్రదర్శితం అవుతుంది. సాధారణంగా చంద్ర గ్రహణం లేదా సూర్య గ్రహణం సమయంలో దేవస్థానాలు మూసి వేస్తారు. శ్రీ జగన్నాథుడు కొలువుదీరిన శ్రీ మందిరం మాత్రం తెరిచే ఉంటుంది. గ్రహణ సమయంలో దర్శనం విశేషంగా పరిగణిస్తారు. గ్రహణ స్పర్శకు ముందుగా పంచాంగం గణాంకాల ప్రకారం పండితుల నిర్ధారణ మేరకు నివేదనలు నివారిస్తారు. తదనుగుణంగా నిత్య సేవలు, పూజాదులు నిలిపి వేస్తారు. గ్రహణ స్పర్శకు ముందుగా రత్న వేదికపై మూల విరాటులకు స్నాన వస్త్రధారణతో తీర్చిదిద్దుతారు. గ్రహణ సమయంలో ఆద్యంతం దర్శనం నిరవధికంగా దొరుకుతుంది. గ్రహణం పట్టు ఘడియల్లో శ్రీ మందిరంలో విశేష సేవలు ప్రారంభిస్తారు. ఈ సమయంలో భక్తులకు అత్యంత చేరువలో లోపలి ప్రాంగణం నుంచి నిరవధిక దర్శనం అవకాశం ఉంటుంది. స్నాన వస్త్ర ధారణలో స్వామి దర్శనం ప్రాప్తిస్తుంది.
ట్రక్ ఓనర్స్ సంఘం
ఉపాధ్యక్షుడిగా మహంతి
కొరాపుట్:
ఒడిశా ట్రక్ ఓనర్స్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడిగా జయపూర్ మున్సిపల్ చైర్మన్ నరేంద్ర మహంతి (నొరి) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం బ్రహ్మపుర పట్టణంలో గంజాం ట్రక్ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు కొరాపుట్ జిల్లా నుంచి లారీ యజమానులు తరలివెళ్లారు. రాష్ట్ర కార్యవర్గంలో వివిధ పదవులకు పలువురు తలపడడంతో పోలింగ్ అనివార్యమైంది. ఉపాధ్యక్ష పదవికి మాత్రం నొరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత 25 ఏళ్లుగా జయపూర్ లారీ ఓనర్స్ అసోసియేషన్‌కి నొరి మహంతి సెక్రటరీగా కొనసాగుతున్నారు.
రాయగడ: సదరు సమితికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని పూజారిబంబు గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే అప్పల స్వామి కడ్రక శనివారం పర్యటించారు. ఈ గ్రామానికి చేరుకోవాలంటే మధ్యలో ఉన్న నాగావళి నదిని దాటాల్సి ఉంటుంది. సరైన రహదారి లేకపొవడంతో సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో అతని వాహనాన్ని విడిచిపెట్టి కాలినడకన గ్రామానికి చేరుకున్నారు. ఇక్కడ 80 కుటుంబాలు నివసిస్తున్నాయి. రెక్కాడితే గాని డొక్కాడని జీవితాలను గడుపుతున్నారు. అంతా ఆదివాసీలే. గ్రామానికి రహదారి లేకపొవడంతో పాటు నిత్యం అవసరాల కోసం పట్టణానికి చేరుకోవాలంటే మధ్యలో నదిని దాటుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి. అదే వర్షాకాలంలో బాహ్య ప్రపంచానికి దూరంగా ఈ గ్రామస్తులు ఉంటారు. నదీలో నీటి ప్రవాహం ఎక్కువైతే నదిని దాటని పరిస్థితి.
సమస్యలు నెలవు..
గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే వద్ద గ్రామస్తులు తమ గ్రామ సమస్యల గురించి ఎకరువు పెట్టారు. ఎన్నికల ముందే దర్శనం ఇచ్చే రాజకీయ నాయకులు ఎన్నికల అనంతరం వారి దర్శనభాగ్యమే కరువయ్యేదని అయితే ఎమ్మెల్యేగా ఎన్నికై న కడ్రక తమ సమస్యల గురించి తెలుసుకోవడానికి గ్రామానికి రావడం తమ అదృష్టంగా భావిస్తున్నామని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. సమస్యలు విన్న ఎమ్మెల్యే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు తనవంతు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. పర్యటన అనంతరం ఎమ్మెల్యే కడ్రక విలేకర్లతో మాట్లాడారు. స్వాతంత్య్రం సిద్ధించి ఏడు దశాబ్దాలు దాటినా ఈ గ్రామం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండటం విచారకరమన్నారు. అదీ కాకుండా సదరు సమితి కేంద్రానికి కేవలం ఎనిమిది కిల్లోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామ పరిస్థితి ఇలా ఉంటే అడవుల్లొ, కొండకొనల్లో నివసించే వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఇట్టే అర్ధమవుతోందని వ్యాఖ్యానించారు. ఈ గ్రామంలో తరచూ పర్యటించి సమస్యలు పరిష్కరిస్తానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.
ప్రమాదంలో 30 అడుగుల దూరంలో పడిన బైక్
ప్రమాదంలో గాయపడిన రామ కమార్, భధ్ర కమార్
పూజారిబంబు గ్రామానికి వెళ్లేందుకు నాగావళి నది దాటుతున్న ఎమ్మెల్యే కడ్రక, అతని అనుచరులు
జయపురం: జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడ సమితి టొపాజొడి గ్రామ సమీపంలో శనివారం సాయంత్రం ఒక బైక్ చెట్టుకు ఢీకొనడంతో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు గాయపడ్డారు. బొయిపరిగుడ సమితి చంద్రపడ పంచాయతీ భెజాగుడ గ్రామం రామ కమార్(37), భధ్ర కమార్(35)లు కలిసి ఇనుప సామాన్లు అమ్మేందుకు శనివారం బొయిపరిగుడ సమితి కాఠపొడ వార సంతకు బైక్‌పై వెళ్లారు. సంత అయ్యాక సాయంత్రం వస్తుండగా మార్గంలో టొపాజొడి గ్రామ సమీపంలో బైక్ అదుపు తప్పి ఒక చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు తుళ్లి దూరంగా పడ్డారు. బైక్ 30 అడుగుల దూరంలో పడింది. ప్రమాద సమాచారం తెలిసిన టంగిణగుడ గ్రామ స్వచ్ఛంద సేవకులు వెంటనే సంఘటనస్థలానికి చేరుకుని గాయపడిన వారిని బొయిపరిగుడ కమ్యూనిటీ ఆస్పత్రికి చేర్చారు. ప్రమాదంలో రామ కమార్‌కు కుడి చేయి విరిగిందని, అలాగే తలపై దెబ్బలు తగిలాయని తెలిపారు. అనంతరం అతడిని జయపురం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు.

గ్రహణం సమయంలో శ్రీ జగన్నాథుని విశేష దర్శనం

గ్రహణం సమయంలో శ్రీ జగన్నాథుని విశేష దర్శనం

గ్రహణం సమయంలో శ్రీ జగన్నాథుని విశేష దర్శనం

గ్రహణం సమయంలో శ్రీ జగన్నాథుని విశేష దర్శనం

గ్రహణం సమయంలో శ్రీ జగన్నాథుని విశేష దర్శనం

గ్రహణం సమయంలో శ్రీ జగన్నాథుని విశేష దర్శనం

గ్రహణం సమయంలో శ్రీ జగన్నాథుని విశేష దర్శనం

గ్రహణం సమయంలో శ్రీ జగన్నాథుని విశేష దర్శనం

గ్రహణం సమయంలో శ్రీ జగన్నాథుని విశేష దర్శనం

గ్రహణం సమయంలో శ్రీ జగన్నాథుని విశేష దర్శనం