
నేటి నుంచి కొరాపుట్‌లో గవర్నర్ పర్యటన
కొరాపుట్: గవర్నర్ కె.హరిబాబు సోమవారం నుంచి కొరాపుట్ జిల్లాలో పర్యటించనున్నారు. ఆకస్మికంగా ఖరారైన పర్యటన సుదీర్ఘంగా జరగనుంది. సోమవారం ప్రత్యేక విమానంలో రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ నుంచి జయపూర్ రానున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన కొరాపుట్ జిల్లా కేంద్రంలోని కాఫీ బోర్డుని సందర్శిస్తారు. అనంతరం సర్క్యూట్ హౌస్‌లో ప్రభుత్వ సాహిద్ లక్ష్మణ్ నాయక్ వైద్య కళాశాల, భారత అల్యూమినియ కేంద్రం (నాల్కో), హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్, కోట్స్ సంస్థల ప్రతినిధులతో సమావేశం అవుతారు. అనంతరం శభరి శ్రీక్షేత్రం జగన్నాథ మందిరం దర్శిస్తారు. 9వ తేదీన సునాబెడా, సిమిలిగుడ, మిలిట్ మిషన్, ఏకలవ్య మోడల్ విద్యా కేంద్రంలను సందర్శిస్తారు. అదే రోజు ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం దేవ మాలిలో ప్రకృతి అందాలు తిలకిస్తారు. 10వ తేదీన మల్కన్‌గిరి జిల్లా పర్యటిస్తారు. తిరిగి 11వ తేదీ కొరాపుట్ జిల్లా కేంద్రంకి తిరిగి వచ్చి వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అదే రోజు తిరిగి భువనేశ్వర్ వెళ్తారు. ఆలస్యంగా ఖరారైన పర్యటన నేపథ్యంలో భారీ వర్షంలో కూడా అధికారులు ఉరుకులు పరుగులతో ఏర్పాట్లు చేస్తున్నారు.