
డీజే శబ్దాలకు ఇద్దరు బలి
రాయగడ: రాయగడలో డీజే శబ్దాలకు ఇద్దరు మృతి చెందారు. స్థానిక రామకృష్ణ నగర్‌లో పోస్టాఫీస్ కాలనీకి చెందిన చంద్ర ఖొర కొడుకు సూరజ్ ఖొర (28), అదేవిధంగా జిల్లాలొని కల్యాణసింగుపూర్ సమితి మజ్జిగుడ గ్రామానికి చెందిన లాడి వేణుగోపాల్ (43) లు గత 24 గంటల వ్యవధిలో గుండెపోటుతో మృతి చెందిన సంఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే .. శుక్రవారం నాడు స్థానిక రామకృష్ణ నగర్‌లో వినాయక నిమజ్జనాలు చేపట్టారు. ఇందులో భాగంగా డీజే సౌండ్ సిస్టమ్‌ను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. నిమజ్జనం చేసే సమయంలో నృత్యాలు చేసి వెళ్తున్న సమయంలో డ్యాన్స్ చేస్తున్న సూరజ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డీజే సౌండ్ వల్ల అతడు గుండెపోటుకు గురైనట్లు భావిస్తున్నారు. అదేవిధంగా శనివారం నాడు కల్యాణసింగుపూర్ సమితి పూజారిగుడలో కూడా అదే తరహా వినాయక నిమజ్జనం సమయంలో డీజే సౌండ్ కారణంగా వేణుగోపాల్ మృతి చెందినట్లు సమాచారం.

డీజే శబ్దాలకు ఇద్దరు బలి