
50 సెంట్ల భూమి తెమ్మని వేధించేవారు
ఆమదాలవలస: చిట్టివలసలో పురుగు మందు తాగి పూర్ణ అనే గృహిణి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్ వివేకానంద ఆదివారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా వివాహిత తల్లిదండ్రులు సింహాచలం, పద్మ మాట్లాడుతూ తమ కుమార్తె పెళ్లి సమయంలో కట్నం కింద రూ.5లక్షల నగదు, ద్విచక్ర వాహనం, రూ.2 లక్షల సారె సమకూర్చినా మరో 50 సెంట్ల భూమి తీసుకురావాలని అత్తింటి వారు నిత్యం వేధించేవారని వాపోయారు. పెళ్లయిన నాలుగు నెలలకే ఇలాంటి పరిస్థితి రావడం దారుణమన్నారు. వరకట్న వేధింపుల కారణంగా తమ కుమార్తె మానసిక వేదనతో ఆత్మహత్య చేసుకుందని వివరించారు. విచారణలో ఎస్సై సనపల బాలరాజు, సర్పంచ్ ప్రతినిధి గుజ్జల లక్ష్మణరావు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.