
గతుకులు పూడ్చుతున్న యువకులు
జయపురం: జయపురం సమితి పాత్రోపుట్ సమీప కొలాబ్ నదిపై గల వంతెన మార్గంలో అనేక గతుకులు ఏర్పడి ప్రజలు, వాహణ దారులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. అలాగనే శ్రావణ మాసంలో ప్రఖ్యాత శివ క్షేత్రం గుప్తేశ్వర్‌కు వేలాది మంది భోల్‌భం కావిడి యాత్రికులు ఈ మార్గంలోనే వెళ్తూ ఇబ్బందులు పడుతున్నారు. అలాగే 326 విజయవాడ–రాంచీ జాతీయ రహదారి అయిన ఈ మార్గంలోనే ప్రతి దినం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రజలు, వాహనదారులు పడుతున్న ఇబ్బందులు చూసిన కొంత మంది యువకులు రవీంద్ర నాయిక్ నేతృత్వంలో స్వచ్ఛందంగా సిమెంట్, కాంక్రీటుతో రోడ్డు గతుకులను కప్పుతున్నారు. గతుకుల రోడ్డు బాగు చేయాలని తాము ఎన్ని సార్లు అధికారులకు విజ్ఞప్తులు చేసినా పట్టించుకోలేదని పాత్రోపుట్ వాసులు ఆరోపించారు.నేడు యువకులు గతుకులు కప్పుతుండడం ఆనందంగా ఉందని అంటున్నారు.

గతుకులు పూడ్చుతున్న యువకులు