
జర్నలిస్టుల డిమాండ్లను పరిష్కరించాలి
జయపురం: జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లను శాశన సభ శీతాకాల సమావేశాల నాటికి పరిష్కరించాలని జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం స్థానిక అప్సరా సభావేదికలో జరిగిన ఉత్కళ సంబాదిక సంఘం (ఒడిశా జర్నలిస్టు అసోసియేషన్)వార్షికోత్సవంలో ముఖ్యఅథిగా పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంలో నాల్గో స్తంభమైన జర్నలిస్టులు సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారని కొనియాడారు. రానున్న విధానసభ సమావేశాల్లో జర్నలిస్టు సమస్యలు వారి డిమాండ్లను తాను ప్రస్థావిస్తానని జర్నలిస్టులకు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో జర్నలిస్టులకు జీవిత బీమా రూ.10 లక్షలకు చేయాలని, పెన్షన్ రూ.5 లక్షలు చెల్లించాలని తాను ఎంతో కాలంగా విధాన సభలో డిమాండ్ చేస్తూనే ఉన్నానని వెల్లడించారు. ఈ సమావేశంలో వివిధ రంగాలలో ప్రశంసనీయ ప్రతిభను ప్రదర్శిస్తున్న ఐదుగురుని ఉల్కళ సంబాదిక సంఘం తరఫున ఘనంగా సన్మానించారు. సన్మానం పొందిన వారిలో ఫవర్ లిప్టింగ్‌లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో పలు బంగారు పథకాలు సాధించిన బిశ్వనాథ్ నాయక్, ఆయన కుమార్తె వైభవీ నాయక్‌ను, స్వచ్ఛంద రక్తదాత సుభాష్ షరాబ్, సీనియర్ పాత్రికేయులు చిత్తరంజన్ చౌదరి, దేవీ ప్రసాద్ మహంతి సన్మానించారు. 9 మంది జర్నలిస్టులకు రూ.5 లక్షల చొప్పున బీమా చేయించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఉత్కళ సంబాదిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బిభుతి భూషణ కర్.. కొరాపుట్ జిల్లా సంఘ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. మూడేళ్లకు ప్రకటించన నూతన కార్యవర్గంలో అధ్యక్షుడిగా కె.శ్రీనివాస రావు, కార్యదర్శిగా నృసింహ బ్రహ్మ, ఉపాధ్యక్షులుగా పింటు ప్రధాన్, మనోజ్ దాస్, ఆనంద ఖొర, త్రినాథ్ ఖొర, సహాయ కార్యదర్శిగా శుభ నారాయణ మహంతి, రామచంద్ర నాయక్, కోశాది కారిగా మధుసూదన పాత్ర, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా చైతన్య హంతాల్, సంక్షేమ నిధి చైర్మన్‌గా ఎస్.సుందరం, సంఘ సలహాదారునిగా బినోద్ మహాపాత్రో, మల్కనగిరి జిల్లా అధ్యక్షుడిగా అశోక్ కుమార్ మిశ్ర, నవరంగపూర్ అధ్యక్షుడిగా పి.ప్రకాశ్‌ను నియమించారు.