కారణమెవరు..?
శుక్రవారం శ్రీ 6 శ్రీ జూన్ శ్రీ 2025
శోకానికి..
కొరాపుట్: కొరాపుట్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాహిద్ లక్ష్మణ్ నాయక్ కళాశాలలో వైద్యం వికటించి ఆరుగురు మృతి చెందారు. గురువారం రాష్ట్ర వైద్య మంత్రి ముఖేష్ మహాలింగ అత్యవసర పర్యటన చేశారు. రాజధాని నుంచి ఆగమేఘాల మీద వైద్య కళాశాలకు తరలి వచ్చారు. మంత్రి వస్తున్నారని తెలిసి కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దాంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున రక్షణ కల్పించింది. ఆస్పత్రి ప్రధాన ద్వారం వద్ద మంత్రితో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే నిమయ్ సర్కార్ మాట్లాడానికి ప్రయత్నం చేశారు. ఇది గమనించిన బీజేపీకి చెందిన కొరాపుట్ ఎమ్మెల్యే రఘురాం మచ్చో దాడికి ప్రయత్నించారు. నిమయ్ అప్రమత్తమై ఎమ్మెల్యేపై ఎదురు దాడికి దిగారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఇద్దరిని విడదీశారు. అనంతరం మంత్రి వైద్య కళాశాలలో వివిధ వార్డులు సందర్శించారు. రోగులకు అందుతున్న చికిత్స అడిగి తెలసుకున్నారు. మందుల కౌంటర్ ని పరిశీలించారు. కళాఽశాలలో ఉన్నత స్ధాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. అసలు మరణాలు ఎలా జరిగాయని ప్రశ్నించారు. సమావేశంలో కలెక్టర్ వీ.కీర్తి వాసన్, కొట్ పాడ్ ఎమ్మెల్యే రుపుధర్ బోత్ర తదితరులు పాల్గొన్నారు.
విచారణ జరిపిస్తున్నాం: మంత్రి ముఖేష్
ఇలాంటి మరణాలు విచారకరమని రాష్ట్ర వైద్య మంత్రి ముఖేష్ మహాలింగం ప్రకటించారు. వైద్య కళాశాల ఆవరణలో మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనపై ప్రభుత్వ విచారణ జరుగుతుందన్నారు. తాను ఆస్పత్రిలో అన్ని వార్డులు పరిశీలించానన్నారు. పూర్తిస్థాయి సమీక్ష జరిగిందని మంత్రి ప్రకటించారు.
వైద్య బృందం పరిశీలన..
ఘటనపై పూర్తిస్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. కటక్, బ్రహ్మపుర వైద్య కళాశాలలకు చెందిన వైద్య నిపుణుల బృందం తరలి వచ్చింది. ఆయా వైద్య నిపుణులు కళాశాలలో తమ విచారణ ప్రారంభించారు. మరో వైపు కాంగ్రెస్ పార్టీకి చెందిన బృందం కళాశాలలో పర్యటించింది. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు మీనాక్షి వాహీని పతి తదితరులు కళాశాలలో వివిధ వార్డుల్లో పర్యటించారు.
రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలి..
వైద్య కళాశాల మృతులకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రామ చంద్ర ఖడం డిమాండ్ చేశారు. గురువారం కొరాపుట్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. ఇవి ప్రభుత్వ హత్యలని అన్నారు. బాధిత కుటుంబాల గోడు వినలేదన్నారు. నర్సులు ఇంజెక్షన్ ఇచ్చిన వెంటనే రోగులు చనిపోయారని పేర్కొన్నారు. మంత్రితో మాట్లాడడానికి వచ్చిన తమ పార్టీ మాజీ ఎమ్మెల్యే నిమయ్ సర్కార్ పై స్థానిక ఎమ్మెల్యే దాడి చేయడం సరికాదన్నారు. చేతకాని ప్రభుత్వం ప్రజా ప్రతినిధులపై బౌతిక దాడులు చేస్తుందన్నారు. ఇలాంటి దాడులతో ప్రజలను భయపెట్టలేరనని రాం చంద్ర ఖడం పేర్కొన్నారు.
న్యూస్‌రీల్
కొరాపుట్ వైద్య కళాశాలలో..
నాయకుల పర్యటన
కారణమెవరు..?
కారణమెవరు..?
కారణమెవరు..?


