త్వరితగతిన సైబర్ నేరాల దర్యాప్తు
● డీజీపీ యోగేష్ బహుదూర్ ఖురానియా
భువనేశ్వర్: తక్కువ సమయంలో సైబర్ నేరాలను సక్రమంగా దర్యాప్తు చేయడంలో సిబ్బంది నైపుణ్యాలను మెరుగుపరచనున్నట్లు రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ యోగేష్ బహదూర్ ఖురానియా తెలిపారు. స్థానిక సైబర్ కాంప్లెక్స్‌లో రాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ సహకారంతో ‘సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు సైబర్ ఇంటెలిజెన్స్’పై మంగళవారం నిర్వహించిన వర్క్‌షాప్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో సైబర్ నేరాలను నివారించడానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. అధికారులకు ఈ వర్క్‌షాప్ ఎంతో సహాయపడుతుందని పేర్కొన్నారు. సైబర్ నిపుణుడు డాక్టర్ రక్షిత్ టాండన్ వివిధ జిల్లాల అధికారులకు శిక్షణ అందించారు. కార్యక్రమానికి క్రైమ్ బ్రాంచ్ డీజీపీ వినయ్‌తోష్ మిశ్రా, ఇన్‌స్పెక్టర్ జనరల్ డాక్టర్ సార్థక్ షడంగి, డీఐజీ (ఎస్‌టీఎఫ్) పినాక్ మిశ్రా తదితరులు హాజరయ్యారు.
త్వరితగతిన సైబర్ నేరాల దర్యాప్తు


