భక్తి శ్రద్ధలతో హనుమాన్‌ జయంతి | - | Sakshi
Sakshi News home page

భక్తి శ్రద్ధలతో హనుమాన్‌ జయంతి

May 23 2025 5:37 AM | Updated on May 23 2025 5:37 AM

భక్తి

భక్తి శ్రద్ధలతో హనుమాన్‌ జయంతి

భువనేశ్వర్‌ : హనుమాన్‌ జయంతి పురస్కరించుకుని ఖుర్దారోడ్‌ అకౌంట్స్‌ కాలనీ బాలాజీ మందిరం హనుమాన్‌ మందిరంలో ప్రత్యేక పూజాదులు జరిపించారు. ఈ సందర్భంగా అభయాంజనేయ స్వామికి అభిషేకం, అష్ట్త్తోర శత నాగవల్లి (తమలపాకులు) దళార్చన, కదలీ ఫలార్చన, హనుమాన్‌ చాలీసా పారాయణం పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ ఉత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

రెడ్‌క్రాస్‌కు మూడేళ్ల వేతనం విరాళం

కొరాపుట్‌: తన మూడేళ్ల వేతనాన్ని రెడ్‌క్రాస్‌కు కౌన్సిలర్‌ విరాళం ఇచ్చారు. గురువారం నబరంగ్‌పూర్‌ జిల్లా కేంద్రంలో 5 వార్డు ఇండిపెండెంట్‌ కౌన్సిలర్‌ ఐ.మురళీకృష్ణ రు.10 వేలు విరాళం చెక్కు అందజేశారు. తాను పాల్గొన్న ప్రతి కౌన్సిల్‌ సమావేశానికి రు.150 చొప్పున ప్రభుత్వ గౌరవ వేతనం అందిందన్నారు. ఈ నగదు మున్సిపల్‌ చైర్మన్‌ కున్ను నాయక్‌ తో వెళ్లి ఈఓ సమరేష్‌ మహంతికి చెక్కు రూపంలో అందజేశారు.

భక్తి శ్రద్ధలతో హనుమాన్‌ జయంతి 1
1/1

భక్తి శ్రద్ధలతో హనుమాన్‌ జయంతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement