
ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి
మల్కన్‌గిరి: ఆంధ్ర –ఒడిశా సరిహద్దుల్లో బుధవారం జరిగిన ఎదురు కాల్పుల్లో మావో అగ్రనేతలు అరుణ, ఉదయ్ తప్పించుకున్నారు. అల్లూరి జిల్లా రామభద్రపురం పోలీసు స్టేషన్ పరిధిలోని దూముకొండ అడవిలో మావోల స్థావరం ఉందని పోలీసులు, గ్రేహౌండ్స్‌సిబ్బంది అడవిని జల్లెడ పడుతున్నారు. బుధవారం సరిహద్దు ప్రాంతంలో జవాన్లకు మావోలు తారసపడడంతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి మరిగేట్ట గ్రామానికి చెందిన వాగా పడియామి అలియాస్ అలియాస్ రమేష్ నాగ్ మృతిచెందాడు. ఇతడిపై ఆంధ్రా, ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో రూ.10 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ముగ్గురు సైబర్ నేరగాళ్ల అరెస్టు
మల్కన్‌గిరి: రాజస్థాన్‌కు చెందిన ముగ్గురు సైబర్ నేరగాళ్లను మల్కన్‌గిరి జిల్లా పోలీసులు గురువారం అరెస్టు చేశారు. మల్కన్‌గిరి జిల్లా కేంద్రం దుర్గాగుడి వీధికి చెందిన ఆఓక్ కుమార్ త్రిపాఠి ఐడీ కార్డులు, బ్యాంక్ పాస్‌బుక్‌లు ఇతర కార్డులను రాజస్థాన్‌కు చెందిన ముగ్గురు యువకులు ఫేక్‌వి తయారు చేశారు. ఆశోక్ ఖాతా నుంచి 2024 అక్టోబర్ నుంచి డబ్బులు తీసేశారు. ఈ విషయాన్ని మల్కన్‌గిరి పోలీసులకు అశోక్ ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి దర్యాప్తు చేస్తున్నారు. చివరికి ఈ ముగ్గురు నిందితులు ముకేష్ కుమార్ (22), సురేంద్రమ్ (20), నరేష్ (21) సైబర్ నేరగాళ్లు.. ముఖేష్ కుమార్ ఖాతాలో రూ.4,50,000 జమ చేసుకున్నారు. మందన్ ఖాతాలో రూ.2లక్షలు జమ చేశారు. ఈ మొత్తం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిని ముంబైలో ఈ నెల 5న అరెస్టు చేశారు. గురువారం మల్కన్‌గిరి తీసుకువచ్చారు. ప్రత్యేక బృందం పోలీసులు పూర్తి విచారణ అనంతరం వివరాలు తెలుస్తాయని జిల్లా ఎస్పీ వినోద్ పటేల్ తెలిపారు.
ఒకే దేశం, ఒకే ఎన్నికతో ఎన్నో లాభాలు
జయపురం: ఒకే దేశం, ఒకే ఎన్నికలకు కేంద్ర ప్రతిపాదనవలన దేశానికి ఎన్నో లాభాలు ఉన్నాయని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు.గురువారం స్థానిక హోటల్‌లో భారతీయ జనతా పార్టీ ఒక దేశం, ఒకే పార్టీ అంశంపై కార్యక్రమం నిర్వహించింది. కొరాపుట్ జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు సుమంత ప్రధాన్ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. వక్తలు మాట్లాడుతూ ఒకే దేశం, ఒకే ఎన్నిక అమలు చేస్తే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. లోక్ సభకు, దేశంలో అన్ని రాష్ట్రాల శాసన సభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే సమయం, ఖర్చు తగ్గుతుందన్నారు.
ఎప్పటికప్పుడు ఎన్నికలు జరిపితే అధికార యంత్రాంగ సమయం, ఆర్థిక వ్యయం జరుగుతుందన్నారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ కార్యదర్శి సౌమేంద్ర జెన, రాష్ట్ర బీజేపీ ప్రవక్త రాజేష్ పట్నాయక్, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ శాశ్వత సభ్యులు గౌతమ్ సామంతరాయ్, ఇంజినీర్ కేధార్ నాఽథ్ బెహరా, పొట్టంగి విధాన సభ బీజేపీ నేత నందబలి చైతన్య, తదితరులు పాల్గొన్నారు.

ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి

ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి