విజయనగరం అర్బన్: పరిశ్రమ రంగానికి అవసరమైన ఆధునిక పరిశోధనలపై విద్యార్థులు ఆసక్తిని పెంచుకోవాలని జేఎన్‌టీయూ జీవీ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఆర్.రాజేశ్వరరావు అన్నారు. ఈ మేరకు స్థానిక జేఎన్‌టీయూ గురజాడ విజయనగరం (జీవీ) వర్సిటీలో ఇంజినీరింగ్ కళాశాల మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా స్టూడెంట్ చాప్టర్ సంయుక్త నిర్వహణలో ‘మెక్ అనో ఎంఎంఎక్స్‌ఎక్స్‌వీ 2025’ అంశంపై నిర్వహించిన జాతీయస్థాయి టెక్నికల్ సింపోజియాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిశ్రమ రంగంలో వస్తున్న ఆధునిక సాంకేతిక పరికరాలు అవి పని చేస్తున్న తీరు తదితర అంశాలపై పరిజ్ఞానాన్ని పెంచడానికి ఇలాంటి సదస్సులు విద్యార్థులకు దోహదపడతాయన్నారు. అనంతరం సావనీర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మెకా నికల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి డాక్టర్ కె.శ్రీనివాస్ ప్రసాద్, వి.మణికుమార్, డాక్టర్ సి.నీలిమదేవి ఫ్యాకల్టీ సమన్వయకర్తలుగా,, స్టూడెంట్ కో ఆర్డినేటర్స్‌గా కె.కౌశిక్, పి.ప్రగతి వ్యవహరించారు.
జేఎన్‌టీయూ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్
రాజేశ్వరరావు
వర్సిటీలో మెక్‌అనో జాతీయ సదస్సు ప్రారంభం