● సభా కార్యకలాపాలకు అంతరాయం ● సాయంత్రం 4 గంటల వరకు వాయిదా
భువనేశ్వర్:
రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతల పట్ల బడ్జె ట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నిలదీస్తోంది. ప్రధానంగా మహిళలు, మైనరు బాలికల పట్ల పెచ్చుమీరుతున్న అత్యాచారాలు, నేరాలపై విరుచుకుపడుతోంది. దీంతో బడ్జెట్ సమావేశాల కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. బుధవారం కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. కాంగ్రెసు సభ్యుల చర్య పట్ల అధికార భారతీయ జనతా పార్టీ సభ్యులు విచారం వ్యక్తం చేశారు. వరుసగా 2 సార్లు వాయిదా సభలో బడ్జెట్ సమావేశాల ఆరంభం నుంచే గందరగోళం నెలకొంది. ప్రశ్నోత్తరాల సమ యం ప్రారంభం నుంచే సభలో కాంగ్రెసు సభ్యులు రభసకు దిగారు. మహిళల భద్రతపై ముఖ్యమంత్రి ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. మహిళలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సభ మధ్యలోకి వచ్చి గందరగోళం సృష్టించారు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేసినట్లు తొలుత ప్రకటించారు. ఆ తర్వాత కూడ సభలో పరిస్థితి కుదుట పడలేదు. సభా కార్యకలాపాలు ముందుకు సాగించడం సాధ్యం కాకపోవడంతో సాయంత్రం 4 గంటలకు వాయిదా వేశారు.
వాయిదా ప్రతిపాదనపై చర్చ కావాలి: కాంగ్రెస్
రాష్ట్రంలో మహిళా వర్గానికి భద్రత లేకుండా పోయిందని, చివరికి పాఠశాలల్లో బాలికలకు రక్షణ కొరవడినా ప్రభుత్వం చోద్యం చూస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సభలో నిలదీశారు. ఈ పరిస్థితుల దృష్ట్యా ముఖ్యమంత్రి సభలో వివరణ ప్రవేశ పెట్టి సభా కమిటి ఏర్పాటు చేయాలని వాయిదా తీర్మానం ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన పట్ల స్పీకరు అంగీకరించకపోవడంతో ఆగ్రహించిన కాంగ్రెసు సభ్యులు స్పీకరు పోడియం వద్దకు వెళ్లి నిరసన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్‌ది స్వార్థపూరిత చర్య: బీజేపీ
రాష్ట్రంలో మహిళల భద్రత అంశం చాటున స్వార్థ ప్రయోజనాల కోసం ఉద్దేశపూర్వకంగా సభా కార్యక్రమాలకు నిత్యం అంతరాయం కలిగిస్తోందనిౖబీజేపీ ఎమ్మెల్యే ఇరాశిష్ ఆచార్య ఆరోపించారు. ఈ అంశంపై సభలో చర్చకు ప్రతి పాదించిన వాయిదా తీర్మానంపై చర్చ జరిగిందని రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి సభలో బదులిచ్చారు.
విచారకరం: డాక్టర్ ప్రసన్న కుమార్ ఆచార్య, బీజేడీ
రాష్ట్రంలో అమాయక మైనరు బాలికలు గర్భం దాల్చడం అత్యంత విచారకరమని,
ప్రధాన విపక్షం బిజూ జనతా దళ్ సభ్యుడు డాక్టర్ ప్రసన్న కుమార్ ఆచార్య అన్నారు. మహిళల పట్ల అఘాయిత్యా లు, హత్యలు వంటి సంఘటనలు నిత్య కృత్యాలుగా పరిణమించాయని ఆవేదన వ్యక్తం చేశారు.
బాలికపై బాలుర లైంగికదాడి
కొరాపుట్: నబరంగ్‌పూర్ జిల్లా ఉమ్మర్‌కోట్ పట్టణంలో బాలిక(11)పై ఇద్దరు బాలురు లైంగిక దాడికి పాల్పడిన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. రెండు రోజుల ముందు బాలికకు పరిచయం ఉన్న 15 ఏళ్ల వయసు గల ఇద్దరు బాలురు బాధితురాలి ఇంటికి వచ్చారు. ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకొని బాలికను బలవంతంగా పక్కనే ఉన్న పొలాల్లోకి లాక్కెళ్లారు. బాలికతో మద్యం తాగించి అపస్మారక స్థితికి చేరాక లైంగికదాడికి పాల్పడి పరారయ్యారు. అనంతరం బాధితురాలు ఇంటికి వెళ్లి చెప్పడంతో పోలీసులు ఆస్పత్రికి తరలించారు. నిందితులను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు భక్త చరణ్ దాస్ నబరంగ్‌పూర్ జిల్లా కాంగ్రెస్ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. మాజీ రాష్ట్ర పీసీసీ ఉపాధ్యక్షుడు మున్నా త్రిపాఠి, ఏఐసీసీ సభ్యురాలు మనీషా త్రిపాఠిలు ఉమ్మర్‌కోట్ చేరుకున్నారు. బాధిత బాలిక కుటుంబాన్ని పరామర్శించారు. ఉమ్మర్‌కోట్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
మహిళల భద్రతపై కాంగ్రెస్ గర్జన
మహిళల భద్రతపై కాంగ్రెస్ గర్జన
మహిళల భద్రతపై కాంగ్రెస్ గర్జన