పాముకాటుతో బాలుడి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

పాముకాటుతో బాలుడి దుర్మరణం

Jun 25 2024 1:00 AM | Updated on Jun 25 2024 6:58 AM

-

రాయగడ: నిద్రస్తున్న సమయంలో ఒక పాము కాటు వేయడంతో నాలుగేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన జిల్లాలోని బిసంకటక్‌ సమితి గొంటిఖాల్‌ గ్రామంలో చోటు చేసుకుంది. మృతుడు అదే గ్రామానికి చెందిన రబి సరక కొడుకు వివేక్‌ సరకగా గుర్తించారు. ఆదివారం రాత్రి ఎప్పటిలాగే భోజనం చేసి ఆరుబయట పడుకున్న వివేక్‌కు పొదల నుంచి వచ్చిన ఒక పాము కాటు వేసింది.

 దీంతో ఏడ్చిన వివేక్‌ను చూసిన తల్లిదండ్రులు చుట్టుపక్కల పరిశీలించగా, ఒక పాము అటువైపుగా వెళ్తుండడం గమనించి వెంటనే చికిత్స కోసం బిసంకటక్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అయితే కాటువేసిన పామును గ్రామస్తులు కొట్టి చంపారు.

Advertisement
 
Advertisement
Advertisement