ఉత్సాహంగా పికిల్ బాల్ టోర్నీ మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): స్థానిక భారతీనగర్‌లోని నైట్రో పికిల్ బాల్ గ్రౌండ్‌లో డాక్టర్స్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో డాక్టర్స్ పికల్ బాల్ లీగ్ సీజన్–1 ఉత్సాహంగా బుధవారం జరిగాయి. ఈ లీగ్‌లో విజయవాడ, గుంటూరు, రాజమండ్రి ప్రాంతాలకు చెందిన వైద్యులు పాల్గొని తమ పికిల్ బాల్ క్రీడలో తమ ప్రతిభను చాటుకున్నారు. లీగ్‌లో డాక్టర్ కానూరు రవి ప్రాతినిధ్యం వహించిన బాపయ్య బ్రాట్ స్పార్టన్స్ జట్టు అద్భుతమైన ఆటతీరుతో విజేతగా నిలిచింది. డాక్టర్ రాకేష్ సారథ్యంలోని స్వరా పికిల్ బాల్ టీమ్ రన్నరప్‌గా నిలిచింది. ఈ లీగ్‌ను తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అతిథిగా హాజరై ప్రారంభించారు. శ్రీనిలయ ఇన్‌ఫ్రా గ్రూప్ చైర్మన్ అమరనేని వెంకట్రావు హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈవెంట్ ఆర్గనైజర్స్ డాక్టర్ తమ్మారెడ్డి సందీప్, డాక్టర్ అక్కినేని శివరామ్ పాల్గొన్నారు. ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ గన్నవరం: రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పీఆర్సీ కమిటీ నియమించడంతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఐఆర్‌ను ప్రకటించాలని ఏఐఎస్టీఎఫ్ జాతీయ ఆర్థిక కార్యదర్శి సీహెచ్ జోసఫ్ సుధీర్‌బాబు డిమాండ్ చేశారు. స్థానిక జెడ్పీ బాలురు, బాలికల హైస్కూల్స్‌లో ఎస్టీయూ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ఉపాధ్యాయుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుధీర్‌బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్య వైఖరిని అవలంభిస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం రెండు న్నరేళ్ల క్రితం ఐఆర్‌ను ప్రకటించి ఉద్యోగుల అభిమానం చూరగొన్నారని చెప్పారు. ఇక్కడ మాత్రం పీఆర్సీ గడు వు ముగిసి మూడేళ్లయిన ఇప్పటి వరకు పీఆర్సీ కమిటీగాని, ఐఆర్ ప్రకటన చేయలేదన్నారు. ఉపాధ్యాయులపై యాప్‌ల పనిభారం తగ్గించాలని ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి దేవరపల్లి విద్యాసాగర్ కోరారు. ఎస్టీయూ జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి సీహెచ్ కృష్ణారావు, మండల అధ్యక్షుడు ఎం. ఆనంద్‌కుమార్, మాజీ రాష్ట్ర సభ్యుడు డి. సామ్యూల్ ప్రసాద్ పాల్గొన్నారు.
ఘనంగా ఓజోన్ దినోత్సవం కలంకారీలో రసాయనాలపై విచారణకు ఆదేశం
కోనేరుసెంటర్: ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కృష్ణా విశ్వవిద్యాలయం ఎన్‌సీసీ విభాగం ఆధ్వర్యంలో బుధవారం అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణలో యువత పాత్రను చాటిచెప్పే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం ఎన్‌సీసీ క్యాడెట్లు పాల్గొని ఓజోన్ పొర పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాల్సిన బాధ్యతపై అవగాహన కల్పించారు. అనంతరం కృష్ణా విశ్వవిద్యాలయం ఎన్‌సీసీ క్యాడెట్లు ఓజోన్ పరిరక్షణపై అవగాహన ప్రతిజ్ఞ చేశారు.
పెడన: కలంకారీ పరిశ్రమలో రంగుల నిమిత్తం క్యాన్సర్ కారకమైన, ప్రమాదకరమైన రసాయనాల వాడకంపై ఆర్‌టీఐ కార్యకర్తలు జంపాన శ్రీనివాస్‌గౌడ్, బేతపూడి జోగేశ్వరరావు, శిరివెళ్ల గౌరి రాష్ట్ర లోకాయుక్తకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో లోకాయుక్త విచారణకు ఆదేశించారు. ఈ మేరకు జంపాన శ్రీనివాస్ గౌడ్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, మెంబర్ సెక్రటరీని విచారణకు ఆదేశిస్తూ పర్యావరణ అటవీ శాఖల ముఖ్యకార్యదర్శి శ్రీకాంతిలాల్ దండే ఉత్తర్వులు జారీ చేశారని ఆయన పేర్కొన్నారు. రంగుల నిమిత్తం కలంకారీ పరిశ్రమలలో వాడుతున్న క్యాన్సర్ కారకమైన ప్రమాదకరమైన రసాయనాల వినియోగంపై ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, మెంబర్ సెక్రటరీ, ఐఎఫ్‌ఎస్ విజయవాడకు చెందిన ఎస్. శ్రీశరవణన్‌ను విచారణ అధికారిగా నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయన్నారు. ఈ ఏడాది జూన్ 20న చేసిన ఫిర్యాదుపై రాష్ట్ర లోకాయుక్త జస్టిస్ పి. రజని ఆదేశాల మేరకు పర్యావరణ అటవీ శాఖల ముఖ్యకార్యదర్శి ఉత్తర్వులు ఇచ్చారన్నారు.