ఎయిడెడ్‌ టీచర్లకు పారదర్శకంగా కౌన్సెలింగ్‌ | - | Sakshi
Sakshi News home page

ఎయిడెడ్‌ టీచర్లకు పారదర్శకంగా కౌన్సెలింగ్‌

Sep 17 2026 2:14 AM | Updated on Sep 17 2026 2:14 AM

ఎయిడెడ్‌ టీచర్లకు పారదర్శకంగా కౌన్సెలింగ్‌

వన్‌టౌన్‌(విజయవాడ పశ్చిమ): ఉమ్మడి జిల్లాలోని ఎయిడెడ్‌ ఉపాధ్యాయుల మిగులు సిబ్బందికి సంబంధించి విద్యాశాఖ 2023 జూన్‌ 22న నిర్ధేశించిన ఉత్తర్వుల ప్రకారం పారదర్శకంగా కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తున్నామని కృష్ణాజిల్లా డీఈవో యూవీ సుబ్బారావు తెలిపారు. ‘సాక్షి’లో ఎయిడెడ్‌కు సర్దు ‘పోటు’ శీర్షికన ప్రచురించిన కథనంపై ఆయన ఓ ప్రకటనలో వివరణ ఇచ్చారు. 44 మంది ఎయిడెడ్‌ మిగులు ఉపాధ్యాయులను వారి ఆప్షన్‌ ప్రకారం అవసరమన్న ఎయిడెడ్‌ పాఠశాలలకు కౌన్సెలింగ్‌ ద్వారా సర్దుబాటు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే శారదా విద్యాలయం హైస్కూల్‌ను ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం మూసివేసినట్లు తెలిపారు. ఆ క్రమంలో అందులో పని చేసే ఉపాద్యాయులను 2022 మే 20 ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వ యజమాన్య పాఠశాలల్లోనే సర్దుబాటు చేయాల్సి ఉందన్నారు.

ప్రెసిడెన్షియల్‌ ఆర్డర్‌ ప్రకారం..

అయితే ప్రెసిడెన్షియల్‌ ఆర్డర్‌ 2025 ప్రకారం విద్యాశాఖ క్యాడర్‌ స్ట్రెంత్‌ను పంపామని, తదుపరి వచ్చే ఆదేశానుసారం ఆ సిబ్బంది సర్దుబాటు చేస్తామని డీఈవో సుబ్బారావు తెలిపారు. అలాగే పాతబస్తీలో జరిగిన కొత్త పోస్టుల భర్తీ నిబంధనల ప్రకారం ఆనాటి డీఈవో ఆదేశాలు ఇచ్చారని, ప్రస్తుత విద్యార్థుల సంఖ్యను బట్టి నలుగురు ఉపాధ్యాయులు మిగులుగా ఉన్నారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement