అద్దాలు పడి లారీ డ్రైవర్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

అద్దాలు పడి లారీ డ్రైవర్‌ మృతి

Sep 13 2026 9:10 AM | Updated on Sep 13 2026 9:10 AM

లక్ష్మీపురం(గుంటూరు): భవనంపైకి అద్దాలు చేరవేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు అద్దాలు పడి లారీ డ్రైవర్‌ మృతి చెందిన ఘటనపై శనివారం అరండల్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ రాణిగారితోటకి చెందిన గుంజి రాజేష్‌(33) లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తుంటాడు. గుంటూరు నగరంలోని నాయుడుపేట 2వ లైన్‌లో నిర్మాణంలో ఉన్న భవనం కోసం అద్దాలు లారీలో తీసుకువచ్చారు. అద్దాలు భవనం పైఅంతస్తుకు చేరవేస్తుండగా తాడు తెగి లారీ డ్రైవర్‌ రాజేష్‌పై పడి తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న భార్య గుంజి జ్యోతి గుంటూరుకు చేరుకుని భర్త మృతదేహం వద్ద కన్నీటి పర్యంతమైంది. అరండల్‌పేట పోలీసులు ఘటనా ప్రదేశానికి వెళ్లి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య జ్యోతి అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement