లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ అంటూ హామీలు ఇచ్చి, రెండేళ్ల పాలనలో వాటిని అమలు చేయకుండా చంద్రబాబు మోసగించిన తీరును ప్రజల్లోకి తీసుకెళ్దామని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు, విజయవాడ తూర్పు ఇన్‌చార్జి దేవినేని అవినాష్ అన్నారు. గురువారం నుంచి ఈ నెల 12వ తేదీ వరకూ నిర్వహించనున్న వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం పోస్టర్‌ను బుధవారం తూర్పు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో కలిసి అవినాష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. వారి మేనిఫెస్టో, సూపర్ సిక్స్ హామీల అమలుపై ప్రజలకు వాస్తవాలు వివరించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. అందులో భాగంగా గురువారం మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ నెల 8, 9 తేదీల్లో ఇండోర్ సమావేశాలు, 12న భారీ ర్యాలీలు నిర్వహించనున్నామని వివరించారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పనిచేస్తూ వాటిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడతామని, వైఎస్సార్ సీపీ ప్రజల పక్షాన నిలిచి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతుందన్నారు. ఈ కార్యక్రమాల ద్వారా కూటమి వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకుడు కడియాల బుచ్చిబాబు, మాజీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కొరివి చైతన్య(వర), మాజీ డెప్యూటీ మేయర్ ఆళ్ల చెల్లారావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి తంగిరాల రామిరెడ్డి, మాజీ కార్పొరేటర్ అంబడిపూడి నిర్మలకుమారి, సోషల్ మీడియా రాష్ట్ర ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ డి.అంజిరెడ్డి, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
చంద్రబాబు మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం
Jun 4 2026 7:09 AM | Updated on Jun 4 2026 7:09 AM
● ఎన్నికల హామీల అమలులో వైఫల్యాలను ఎండగడదాం
● వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్
● ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ
● నేటి నుంచి 12వ తేదీ వరకునిరసన కార్యక్రమాలు
Advertisement


