శ్రీమన్నారాయణుడి సేవలో వైఎస్సార్‌ సీపీ నేతలు | - | Sakshi
Sakshi News home page

శ్రీమన్నారాయణుడి సేవలో వైఎస్సార్‌ సీపీ నేతలు

Apr 29 2026 8:36 AM | Updated on Apr 29 2026 8:36 AM

కోడూరు: మండలంలోని ఉల్లిపాలెం గ్రామంలో వేంచేసిన శ్రీగోద, రాజ్యలక్ష్మి సమేత శ్రీమన్నారాయణ స్వామిని వైఎస్సార్‌ సీపీ నేతలు మంగళవారం దర్శించుకున్నారు. మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, సింహాద్రి రమేష్‌బాబు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. పండితులు వారికి పూర్ణకుంభతో స్వాగతం పలికారు. ఆలయ నిర్మాణకర్త త్రిదండి అష్టాక్షరీ సంపత్‌కుమార రామానుజ జీయర్‌ స్వామిజీ వారికి ఆలయ విశిష్టను వివరించారు. అనంతరం 13 యాగశాలల్లో జరుగుతున్న హోమ క్రతువును నేతలు తిలకించారు. వేదికపై అష్టాక్షరీ స్వామిజీ అధ్యక్షతన జరిగిన సభలో ప్రసంగించారు. త్వరలో ఈ క్షేత్రాన్ని తమ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సందర్శిస్తారని చెప్పారు. అనంతరం అష్టాక్షరీ స్వామిజీని వెలంపల్లి, మల్లాది, సింహాద్రి సత్కరించారు.

Advertisement
 
Advertisement
Advertisement