మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): వేసవి వచ్చేసింది. పరీక్షలు అన్నీ ముగి యడంతో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. కొంత మంది చిన్నారులు వేసవి సెలవులకు అమ్మమ్మ, తాతయ్య, బంధువుల ఇళ్లకు వెళ్లి సెలవులను సరదాగా గడిపి, ఆత్మీయత, అనురాగాలు నింపుకొని వస్తుంటారు. ఇంకొందరు విజ్ఞాన, విహార యాత్రలకు వెళ్తారు. మరి కొందరు విద్యార్థులు వేసవి శిక్షణ శిబిరాల్లో చేరి తమ నైపుణ్యాలను మరింత పెంచుకుంటారు. విద్య, క్రీడలు, యోగ, చిత్రలేఖనం వంటి శిబిరాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. పలు సంస్థలు ఉచితంగా, మరి కొన్ని నామమాత్రపు ఫీజుతో వేసవి శిబిరాలను నిర్వహిస్తున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఏ శిబిరం ఎక్కడ జరుగుతోందో తెలుసుకుందాం పదండి..
శిక్షణ శిబిరాల వివరాలు ఇవీ..
● విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని వివేకానంద సెంటినరీ హైస్కూల్ ఆవరణలో కరాటే, చదరంగం, కర్రసాము, సంగీతం, స్పోకెన్ ఇంగ్లిష్, తెలుగు వెలుగు, కూచి పూడి నృత్యం, భగవద్గీత శ్లోకాలు, హిందీ పరిచయం, డ్రాయింగ్, కంప్యూటర్ కోర్సుల్లో వేసవి శిక్షణ కేంద్రం నిర్వహిస్తున్నారు. వివరాలకు 85002 89429 సెల్ నంబరులో సంప్రదించొచ్చు.
● మొగల్రాజపురంలోని పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కళాశాల ఆవరణలో బ్యాడ్మింటన్, యోగా, జిమ్, ఏరోబిక్స్ అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. వివరాలకు 63041 90057, 99599 59530 సెల్ నంబర్లను సంప్రదించాలి.
● విజయవాడ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో మే ఒకటి నుంచి 31వ తేదీ వరకు వివిధ క్రీడాంశాల్లో వేసవి శిక్షణా శిబిరాలను నిర్వహించనున్నారు. గాంధీనగర్, గురునానక్ కాలనీ, చిట్టినగర్‌లో కె.ఎల్.రావు స్మిమ్మింగ్ పూల్స్‌లో స్మిమ్మింగ్‌లో శిక్షణ ఇస్తారు. బందరురోడ్డులో దండమూడి రాజగోపాలరావు, పటమటలోని చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియాల్లో బ్యాడ్మింటన్, సత్యనారాయణపురంలోని జి.వి.ఎస్.శాస్త్రి ఉద్యానవనం, దండమూడి రాజగోపాలరావు ఇండోర్ స్టేడియం, భవానీ పురంలోని రోజ్ గార్డెన్ పార్కు ఆవరణలో స్కేటింగ్, పటమట చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో యోగాలో శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. ఆయా కేంద్రాలకు వెళ్లి పేర్లు నమోదు చేసుకోవాలి.
● బందరు రోడ్డులోని ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియం ఆవరణలోని ఈ–బ్లాక్‌లో ఉన్న అమరావతి యోగా అండ్ ఏరోబిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉదయం 5.30 నుంచి ఏడు గంటల వరకు యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. వివరాలకు 77318 77444 సెల్ నంబరులో సంప్రదించాలి.
● బందరురోడ్డులోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞానకేంద్రం (ఎంబీవీకే)లో స్పోకెన్ ఇంగ్లిష్‌లో శిక్షణ తరగతులు నిర్వ హిస్తున్నారు. వివరాలకు 94900 98042 సెల్ నంబరులో స్పందించాలి.
● పటమటలోని సర్వోత్తమ గ్రంథాలయ ఆధ్వర్యంలో చిన్నారులకు విజ్ఞానదాయక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పిల్లలకు పుస్తక పఠనం అలవాటు చేయాలనే ఉద్దే శంతో లిటిల్ రీడింగ్ చాంప్–2026 పేరుతో పలు కార్యక్రమాలు, పోటీలు నిర్వహిస్తు న్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల్లోపు గ్రంథాలయానికి వచ్చి 100 గంటలకు పైగా పుస్తకం పఠనం చేసిన వారికి బహుమతులను అందజేస్తారు. సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల వరకు టాయ్ లైబ్రరీ పేరుతో విద్యార్థుల్లో ఉచ్చారణ మెరుగు పరచడానికి పుస్తకాల్లోని అంశాలను అందరికి వినబడేలా చదవడం, భావ నైపుణ్యాలు పెంపొందించడానికి కథలు చెప్పడం, కథలు రాయడం, వంటి అంశాలపై పోటీలు నిర్వహించి బహుమతులను అందజేస్తారు.
● మొగల్రాజపురంలోని రావిచెట్టు సెంటర్‌లో ఉన్న జనశిక్షణ సంస్థాన్ ఆధ్వర్యంలో విద్యుత్ వాహన సర్వీసింగ్, రిపేరింగ్, అసెంబ్లింగ్‌లో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. వివరాలకు 0866 – 2470420 ఫోన్ నంబరులో సంప్రదించాలి.
● మే మూడు నుంచి జూన్ రెండో తేదీ వరకు కృష్ణాజిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో క్రికెట్ కోచింగ్ శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఎనిమిది నుంచి 12 సంవత్సరాల మధ్య వయస్సు బాలబాలికలు మాత్రమే అర్హులు. ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియం సీ–బ్లాక్‌లో ఉన్న కృష్ణా జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలి. విజయవాడ లోని సిద్ధార్థ మెడికల్ కళాశాల మైదానంలో శిక్షణ పొందాలనుకునేవారు 91779 91616, అజిత్‌సింగ్‌నగర్‌లోని మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో శిక్షణ పొందాలనుకునేవారు 93934 44279, జగ్గయ్యపేటలో శిక్షణ పొందాలనుకునే వారు 93469 68443, నూజివీడులో శిక్షణ పొందాలనుకునేవారు 73863 47777 నంబర్లలో సంప్రదించాలి.
● కృష్ణాజిల్లా క్రీడాభివృద్థి సంస్థ ఆధ్వర్యంలో మే ఒకటి నుంచి 31వ తేదీ వరకు ఎనిమిది నుంచి 16 సంవత్సరాల లోపు బాలబాలికలకు ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంతో పాటుగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో వివిధ క్రీడాంశాల్లో సమ్మర్ కోచింగ్ క్యాంప్‌లను నిర్వహించనున్నారు.


