పీజీఆర్‌ఎస్‌కు 134 అర్జీలు | - | Sakshi
Sakshi News home page

పీజీఆర్‌ఎస్‌కు 134 అర్జీలు

Apr 28 2026 8:52 AM | Updated on Apr 28 2026 8:52 AM

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)కు వచ్చే అర్జీలకు సరైన పరిష్కారం చూపాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.ఇలక్కియ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌ జరిగింది. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన అనంతరం జేసీ ఇలక్కియ మాట్లాడుతూ.. అర్జీలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. మొత్తం 134 అర్జీలు అందాయన్నారు. వీటిలో శాఖల వారీగా ఎంఏయూడీకి 80, పోలీస్‌ శాఖ 30, పీఆర్‌ 19, హెల్త్‌ 8, రెవెన్యూ, ఏపీసీపీడీసీఎల్‌కు ఏడు చొప్పున, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఐదు, విద్య, రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంపులుకు నాలుగు చొప్పున, వ్యవసాయం, పశుసంవర్ధక శాఖ మూడు, ఏపీఎస్‌ డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌, సమన్వయ విభాగం (కలెక్టరేట్‌), దేవదాయ, ఎల్‌డీఎం, ఆర్టీసీ, పౌర సరఫరాలు, విభిన్న ప్రతిభావంతులు, డీఆర్‌డీఏ, మత్స్య, ఆహార భద్రత, ఐసీడీఎస్‌, అటవీ, కార్మిక, మెప్మా, గనులు, ఎకై ్సజ్‌, సాంఘిక సంక్షేమం శాఖలకు సంబంధించి మిగిలిన అర్జీలు అందాయి. విజయవాడ నగరంలో పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఎం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. టిడ్కో ఇళ్లు కేటాయించాలని, పేదలు నివాసం ఉంటున్న ఇళ్లకు పట్టాలు ఇవ్వాలని, రిజిస్ట్రేషన్‌ సౌకర్యం కల్పించాలని కోరారు. అంతకు ముందుకు కలెక్టరేట్‌ ఆవరణలో ఇళ్ల స్థలాల కోసం ఆందోళన చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement