ఇబ్రహీంపట్నం: ఏపీ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ సర్వసభ్య సమావేశం యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మోదుగు మోహనరావు అధ్యక్షతన సోమవారం జరిగింది. ఈ సమావేశంలో ఎన్టీటీపీఎస్ నూతన రీజనల్ కార్యవర్గం ఎన్నిక నిర్వహించారు. రీజనల్ అధ్యక్షుడిగా షేక్ సలీమ్, వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్, ఉపాధ్యక్షులుగా సుబ్బారావు, పార్వతి, రత్నరావు, రీజనల్ కార్యదర్శిగా రవీంద్రకుమార్, సహాయ కార్యదర్శిగా రవికుమార్, సత్తిరాజు, ప్రవీణ్‌కుమార్, కోశాధికారిగా కిషోర్, పబ్లిసిటీ కార్యదర్శిగా ఏసుదాసును ఎన్నుకున్నారు. అనంతరం సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన సభ్యులు కార్మికుల సమస్యలపై పోరాటం చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు మోహనరావు సూచించారు.


