గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ ప్రదర్శన విజయవంతం | - | Sakshi
Sakshi News home page

గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ ప్రదర్శన విజయవంతం

Apr 27 2026 8:42 AM | Updated on Apr 27 2026 8:42 AM

గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ ప్రదర్శన విజయవంతం

పెనమలూరు: గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ ప్రదర్శనలో స్థానిక క్రీడాకారులు విజయవంతంగా పాల్గొని ఉత్తమ ప్రదర్శించారు. ఈ మేరకు ఆదివారం యనమలకుదురుకు చెందిన వాన్‌కాన్‌ డో ఫెడరేషన్‌ ఇంటర్నేషనల్‌ ఏపీ చీఫ్‌ ఎస్‌.దుర్గారావు వివరాలు తెలుపుతూ హైదరాబాద్‌ గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం వి.విఠల్‌ ఆధ్వర్యంలో గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డుకు 20 నిముషాల పాటు కాటా నిరంతర ప్రదర్శన 10 రాష్ట్రాల నుంచి రెండు వేల మంది కరాటే క్రీడాకారులు పాల్గొన్నారన్నారు. యనమలకుదురు, విజయవాడ ప్రాంతాల నుంచి తమ విద్యార్థులు 11 మంది విద్యార్థులు ప్రదర్శనలో పాల్గొని సత్తాచాటారని చెప్పారు. పాల్గొన్న విద్యార్థుల్లో ఉప్పల మురళీమోహిత్‌, ఆరేపల్లి షణ్ముఖశ్రీహర్ష, ఆరేపల్లి దోలవెంకటశుభాష్‌, కొరె మోక్షిత, బెజవాడ కార్తీక్‌సాయి, బెజవాడ లక్ష్మణనాగశ్రీనివాస్‌, నైనా, దేవరకొండ హేమశ్రీ, వంశీకృష్ణ, ప్రభుకిరణ్‌రెడ్డి, మోహనప్రగ్న పాల్గొని ఉత్తమ ప్రతిభ చూపారన్నారు. పి.జానకిరాములు, ఉప్పల కోటేశ్వరరావు విద్యార్థులకు స్ఫూర్తినింపారని చెప్పారు. గిన్నిస్‌బుక్‌ ప్రదర్శన విజయవంతంగా ముగిసిందని, త్వరలో వరల్డ్‌ రికార్డు సర్టిఫికెట్లు అందుతాయన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement