విజయవాడకల్చరల్: శ్రీ సద్గురు సంగీత సభ ఆధ్వర్యంలో దుర్గాపురంలోని శివరామకృష్ణ క్షేత్రంలో నిర్వహిస్తున్న సద్గురువు త్యాగరాజ స్వామి 259వ జయంతి సందర్భంగా వారం రోజులుగా నిర్వహిస్తున్న సంగీతోత్సవాలు ఆదివారం ముగిశాయి. ఘనరాగ పంచరత్నకీర్తనలను విఘ్నేస్వర స్తుతితో ప్రారంభించారు. పలు కీర్తనలను 200 మంది విద్వాంసులు, వాద్యకళాకారులు ఏకకాలంలో ఆలపించారు. గౌరీనాథ్, గాయత్రి గౌరీనాథ్, చారుమతి పల్లవి, మోదుమూడి సుధాకర్, అంజనా సుధాకర్, వేమూరి విశ్వనాథ్, దుర్గాభవాని, పలువురు విద్వాంసులు పాల్గొన్నారు.
త్యాగరాజ స్వామి కృతులకు నృత్యాభిషేకం
కూచిపూడి నాట్యాచార్యుడు చింతారవి బాల కృష్ణ బృందం త్యాగరాజ స్వామి రచించిన కీర్తనలకు నృత్యాలను అభినయించారు. కార్యక్రమంలో భాగంగా త్యాగరాజ స్వామి రచించిన ఉత్సవ సంప్రదాయ కీర్తనలను సంగీత విద్వాంసుడు ఎన్‌సీహెచ్ బుచ్చయ్యాచార్యులు బృందం ఆలపించారు. పవళింపు సేవతో త్యాగరాజ స్వామి 259 జయంతి ఉత్సవాలు ముగిశాయి. సంస్థ అధ్యక్షుడు బీవీఎస్ ప్రకాష్, సభ్యులు హరి ప్రసాద్, వీర్ సుబ్రహ్మణ్యం నిర్వహించారు.


