ఉమ్మడి కృష్ణా జిల్లాలో పలు పెట్రోలు బంకుల్లో శనివారం అకస్మాత్తుగా డీజిల్, పెట్రోలు కొరత ఏర్పడింది. దీంతో చాలా బంకుల వద్ద సుమారు అర కిలోమేటరు మేర వాహనాలు బారులు తీరాయి. కొన్ని బంకుల్లో ఏకంగా నోస్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. చల్లపల్లిలో ఓ బంకులో ఐదు రోజుల డీజిల్ నిల్వలు కేవలం మూడు గంటల వ్యవధిలో అయిపోయాయని ఆ బంకు యజమాని చెప్పారు. విజయవాడ నగరంలో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద, రామవరప్పాడు రింగ్ వద్ద ఉన్న పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టారు. – సాక్షి, విజయవాడ ఫొటోగ్రాఫర్


