విజయవాడ సిటీ | - | Sakshi
Sakshi News home page

విజయవాడ సిటీ

Apr 24 2026 7:26 AM | Updated on Apr 24 2026 7:26 AM

శుక్రవారం శ్రీ 24 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026 ఠాణాలో ఆకస్మిక తనిఖీ దుర్గమ్మ సేవలో .. మర్యాదపూర్వక కలయిక 26న ఇంటర్నేషనల్‌ ఓపెన్‌ రాపిడ్‌ చెస్‌ టోర్నమెంట్‌

న్యూస్‌రీల్‌

దళారులను నమ్ముకొని నష్టపోయాం

ప్రభుత్వం ఆదుకోవాలి

మార్కెట్‌ యార్డు, రోడ్లపైనే మగ్గుతున్న మొక్కజొన్న కనీస మద్దతు ధర ఊసే ఎత్తని ప్రభుత్వం ఎన్టీఆర్‌లో 45,500, కృష్ణా జిల్లాలో 18,250 ఎకరాల్లో మొక్కజొన్న సాగు పట్టించుకోని ప్రభుత్వం

ఎన్టీఆర్‌ జిల్లా
శుక్రవారం శ్రీ 24 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

తోట్లవల్లూరు: తోట్లవల్లూరు పోలీస్‌స్టేషన్‌లో గురువారం సాయంత్రం కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు ఆకస్మికంగా తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించారు.

ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌చంద్ర పునేత గురువారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ఏపీ ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనిల్‌ చంద్ర పునీతను ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో జేఏసీ ప్రతినిధులు కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు సంపూర్ణ సహకారం అందిస్తారని తెలిపారు. ఎన్నికల కమిషనర్‌ను కలిసిన వారిలో జేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ సెక్రటరీ జనరల్‌ పలిశెట్టి దామోదరరావు, ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి రామిశెట్టి వెంకట రాజేష్‌, రాష్ట్ర కార్యదర్శి రజనీకాంత్‌ రెడ్డి, ఆర్టీసీ ఈయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వి.నర్సయ్య, రాష్ట్ర ప్రభుత్వ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ కేశవ్‌ తదితరులు ఉన్నారు.

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): వన్‌డే ఇంటర్నేషనల్‌ ఓపెన్‌ ఫిడే రాపిడ్‌ చెస్‌ టోర్నమెంట్‌–2026ను ఈ నెల 26న కానూరులోని స్పాట్‌ స్పైన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో నిర్వహిస్తామని ఆంధ్ర చెస్‌ అసోసియేషన్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఫణికుమార్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఓపెన్‌ కేటగిరీతో పాటు అండర్‌–7, 9, 11, 13, 15 బాల బాలికల విభాగంలో పోటీలు జరుగుతాయని చెప్పారు. టోర్నమెంట్‌లో పాల్గొనాలనుకునే వారు ఏపీ చెస్‌డాట్‌ఓఆర్‌జీ వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని, వివరాలకు 97007 75220, 92471 53387 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

ఈ చిత్రంలోని వ్యక్తి పేరు నరసింహారావు. వత్సవాయి మండలం, పెంటాలవారిగూడెంలో నివసిస్తున్నారు. ఐదెకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. ఎకరానికి రూ.30వేలకు పైగా పెట్టుబడి పెట్టారు. ఈ ఏడాది వర్షాలకు పత్తి దెబ్బతినటంతో ఆ నష్టాన్ని పూడ్చుకుందామని మొక్కజొన్న సాగు చేశారు. గాలివానకు పంట మొత్తం నేలవాలింది. వచ్చిన పంటను అమ్ముకుందామంటే కేంద్ర ప్రభుత్వం కింటాకు రూ.2400 మద్దతు ధర ప్రకటించినా మార్క్‌ఫెడ్‌ కొనుగోలు చేయడం లేదు. దళారులకు క్వింటాకు రూ.1600 నుంచి రూ.1700 కు అమ్ముకోవాల్సి వచ్చింది. కోత కూలీ గతంలో ఎకరానికి రూ. 3వేలు అయితే ఇప్పుడు ఏకంగా రూ.12 వేలకు పైగా అయింది. ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోళ్లు చేయాలని కోరుతున్నారు.

ఇరవై ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశాను. ప్రభుత్వం మద్దతు ధరకు మొక్కజొన్నను కొనుగోలు చేయకపోవడంతో దళారులకు అమ్ముకొని నష్టపోయాం. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేసింది. ఎకరానికి రూ.50వేల వరకు పెట్టుబడి పెట్టాం. ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో క్వింటాకురూ.600 నుంచి 700 చొప్పున.. సరాసరిన ఎకరాకు 20వేలకు పైగా నష్టపోయాం. ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్లినా పట్టించుకునే నాథుడే లేడు.

– ఉయ్యూరు మల్లారెడ్డి, రైతు, వేములపల్లి, కంచికచర్ల మండలం

రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన మొక్కజొన్న దిగుబడులను అమ్మడానికి రైతులు అవస్థ పడుతున్నారు. గిట్టుబాటు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఆశ పడిన రైతులకు నిరాశే ఎదురవు తోంది. పంట చేతికొచ్చి నెల రోజులు దాటుతున్నా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత్యంతరం లేక దళారులను ఆశ్రయిస్తుండగా వారు అందిన కాడికి దోచుకుంటున్నారు.

సాక్షి, ప్రతినిధి, విజయవాడ: మొక్కజొన్నకు మద్దతు ధర దక్కకపోవడంతో ఉమ్మడి కృష్ణా జిల్లా రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. పంట చేతికొచ్చి దాదాపు నెలరోజులు దాటుతున్నా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. దీంతో మొక్కజొన్న కల్లాలు, మార్కెట్‌ యార్డుల్లో మగ్గుతోంది. దళారులకు అమ్మలేక, ప్రభుత్వ కనీస మద్దతు ధర లభిస్తుందనే ఆశతో రైతులు ఎదురు చూస్తున్నారు. రైతులు, తాము పడుతున్న కష్టాన్ని ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం కనిపించడం లేదు.

రూ.153 కోట్లకు పైగా నష్ట పోతున్న రైతులు

ఎన్టీఆర్‌ జిల్లాలో 45,500, కృష్ణాలో 18,250 ఎకరాల్లో మొక్క జొన్న పంటను సాగు చేశారు. ఎకరాకు సరాసరిన 30–35 క్వింటాల దిగుబడులు వచ్చాయి. మొక్క జొన్న పంటకు కేంద్ర ప్రభుత్వం కల్పించిన కనీస మద్దతు ధర క్వింటాకు రూ.2400. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. ప్రస్తుతం మార్కెట్‌లో మొక్కజొన్నను క్వింటాకు రూ.1600 నుంచి 1700 వరకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. 20.40 లక్షల క్వింటాళ్ల జొన్న దిగుబడులు వచ్చాయి. రైతులు క్వింటాకు ప్రస్తుతం ఉన్న ధర ప్రకారం రూ.750 నష్టపోతున్నారు. అంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులు దాదాపు రూ.153 కోట్ల మేర కోల్పోతున్నారు.

మినుము, పెసర పంటలదీ అదే పరిస్థితి

పంట చేతి కొచ్చే సమయంలో ధరలు పతనమవుతున్నాయి. కృష్ణా జిల్లాలో మినుము 3.25 లక్షల ఎకరాలు, పెసర పంట 18వేల ఎకరాల్లో సాగైంది. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో మినుము పంట దిగుబడులు వస్తున్నాయి. నెలరోజుల క్రితం క్వింటాలు రూ.8,400కు మినుములను కొనుగోలు చేశారు. ప్రస్తుతం క్వింటాలు రూ.7700కు కొనుగోలు చేయడంతో రైతు క్వింటాకు రూ.700 నష్టపోతున్నారు. పెసల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది.

7

మాది తోట్లవల్లూరు మండలంలోని తోడేళ్ల లంక దిబ్బ గ్రామం. 5 ఎకరాల్లో మొక్క జొన్న సాగు చేస్తున్నాను. గతంలో కృష్ణా నది వరదలతో మినుము పూర్తిగా పాడైంది. తర్వాత మొక్క జొన్న సాగు చేస్తున్నాను. చాలా అప్పు చేశాను. ప్రస్తుతం ఎకరానికి 30 క్వింటాళ్ల వరకు పండే అవకాశముంది. ఈ ఏడాది ఈదురు గాలులకు దిగుబడి తగ్గింది. ప్రభుత్వం మద్దతు ధరకు జొన్నను కొనుగోలు చేయడం లేదు. దళారులకు విక్రయించి నష్టపోతున్నాం.

– గంగిశెట్టి సత్యనారాయణ,

తోడెళ్ల లంక దిబ్బ, తోట్లవల్లూరు, కృష్ణా

Advertisement
 
Advertisement
Advertisement