వీఎంసీ కమిషనర్‌కు ప్రత్యేక అభినందన | - | Sakshi
Sakshi News home page

వీఎంసీ కమిషనర్‌కు ప్రత్యేక అభినందన

Apr 24 2026 7:26 AM | Updated on Apr 24 2026 7:26 AM

పటమట(విజయవాడతూర్పు): విజయవాడ నగరపాలక సంస్థ 2025–2026 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా పన్ను వసూళ్లు చేసినందుకు పురపాలక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎస్‌. సురేష్‌ కుమార్‌ ప్రత్యేకంగా అభినందించారు. గురువారం సాయంత్రం జయప్రకాష్‌ నగర్‌లోని స్కూల్‌ అఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌ (స్పా)లో నిర్వహించిన సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్మెంట్‌ రూల్స్‌ 2026, రాష్ట్ర స్థాయి మునిసిపల్‌ కమిషనర్ల వర్క్‌షాప్‌లో ప్రిన్సిపల్‌ సెక్రెటరీ ఎస్‌. సురేష్‌ కుమార్‌ వీఎంసీ కమిషనర్‌ ధ్యానచంద్రను సన్మానించారు. ఈ సందర్భంగా వీఎంసీ కమిషనర్‌ ధ్యానచంద్ర మాట్లాడుతూ, ఈ ఘనత వీఎంసీ సిబ్బంది సమష్టి కృషికి ప్రతిఫలమని తెలిపారు. కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ సంపత్‌ కుమార్‌, రీజనల్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ నాగ నరసింహారావు, విజయవాడ నగరపాలక సంస్థ డెప్యూటీ కమిషనర్‌ (రెవెన్యూ) జి.సృజన తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement