అరటి కాయల లోడు లారీ బోల్తా | - | Sakshi
Sakshi News home page

అరటి కాయల లోడు లారీ బోల్తా

Apr 23 2026 8:42 AM | Updated on Apr 23 2026 8:42 AM

గన్నవరం: జాతీయ రహదారి పక్కన లారీ బోల్తా పడిన ప్రమాదంలో నలుగురు గాయపడిన సంఘటన గన్నవరం సమీపంలో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం... అరటికాయల లోడుతో లారీ జార్ఖండ్‌ నుంచి జంషెడ్‌పూర్‌కు బయలుదేరింది. బుధవారం తెల్లవారుజామున లారీ స్థానిక శ్రీనివాస హేచరీస్‌ సమీపంలోని లారీ కాటా వద్దకు రాగానే ఒక్కసారిగా అదుపుతప్పి జాతీయ రహదారి పక్కన బోల్తా పడింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, అటుగా వెళ్తున్న వాహనదారులు స్పందించి లారీలో ఇరుక్కుపోయిన నలుగురి ని సురక్షితంగా బయటకు తీశారు. ఈ ప్రమాదంలో నలుగురు స్పల్పంగా గాయపడ్డారు. డ్రైవర్‌ నిద్రమత్తు కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement